వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో గోల్‍‌మాల్.. వెలుగులోకి భారీ కుంభకోణం: యాక్సిస్ బ్యాంకుకి 4వేల కోట్ల కుచ్చుటోపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో వరుస కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయి. మొన్న నీరవ్ మోడీ కుంభకోణం, నిన్న హిమాచల్ ప్రదేశ్ లో ట్యాక్స్ కుంభకోణం, రొటొమ్యాక్ స్కామ్.. తాజాగా పారేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ (పీఏఎల్) కుంభకోణం వెలుగుచూసింది.

యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.4వేల కోట్ల రుణాలను తీసుకున్న ఈ కంపెనీ.. తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో బ్యాంకును మోసం చేశారన్న ఆరోపణలపై పారేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

పీఎన్‌బీలో మరో స్కాం.. ఈసారి రూ.9.1 కోట్లు! ఇదీ నీరవ్ మోడీ తరహాలోనే... పీఎన్‌బీలో మరో స్కాం.. ఈసారి రూ.9.1 కోట్లు! ఇదీ నీరవ్ మోడీ తరహాలోనే...

ముగ్గురు డైరెక్టర్ల అరెస్ట్..:

ముగ్గురు డైరెక్టర్ల అరెస్ట్..:

కుంభకోణం వెలుగుచూడటంతో పీఏఎల్‌కు చెందిన భవర్ లాల్ భండారీ, ప్రేమాల్ గోరగాంధీ, కమలేష్ కనుంగో అనే ముగ్గురు డైరెక్టర్లపై చీటింగ్, ఫోర్జరీ, నమ్మక ద్రోహం వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు. యాక్సిస్ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే విచారణ జరుపుతున్నామన్నారు.

వెలుగులోకి మరో భారీ స్కామ్: రూ.3000 కోట్ల పన్ను ఎగవేసిన పారిశ్రామికవేత్తవెలుగులోకి మరో భారీ స్కామ్: రూ.3000 కోట్ల పన్ను ఎగవేసిన పారిశ్రామికవేత్త

అక్రమంగా ఎల్సీ..:

అక్రమంగా ఎల్సీ..:

బ్యాంకుల నుంచి రుణాలు పొందే విషయంలో పీఏఎల్ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు తేల్చారు. మొత్తం 20బ్యాంకుల నుంచి పీఎల్ఏ రుణాలు పొందినట్టుగా గుర్తించారు. ఇందుకోసం 2011లో యాక్సిస్ బ్యాంకు ఫోర్ట్ శాఖ నుంచి పీఎల్ఏ ఎల్సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను తీసుకుందని, అయితే రుణాల మంజూరు కోసం బోర్డు సమావేశాల్లో తప్పుడు మినిట్స్ నమోదు చేశారని నిర్దారించారు.

రుణాలను సొంతానికి వాడుకున్నారు..:

రుణాలను సొంతానికి వాడుకున్నారు..:

125 కోట్ల షార్ట్ టర్మ్ రుణాలను తీసుకున్న పీఏఎల్.. మొదట్లో వాటి చెల్లింపులను సక్రమంగానే జరిపిందని అధికారులు గుర్తించారు. అయితే రాను రాను కంపెనీ అవసరాల కోసం తీసుకున్న నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాజమాన్యం వాడుకుందని తేల్చారు. కంపెనీ యంత్రాల కొనుగోలుకై అక్రమ ఎల్సీల ద్వారా రుణాలు పొంది, ఆ డబ్బును సొంతానికి వాడుకున్నట్టు దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాయి.

డబ్బా కంపెనీల పేరుతో..:

డబ్బా కంపెనీల పేరుతో..:


యాక్సిస్ బ్యాంకు కంటే ముందే ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు పీఏఎల్ పై ఫిర్యాదు చేయడంతో.. సీబీఐ దానిపై విచారణ జరుపుతూ వచ్చింది. దాంతో పాటు నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్‌లోనూ ఓ కేసు నడుస్తోంది.

మొత్తం 22బ్యాంకుల నుంచి పీఏఎల్ రుణాలు పొందినట్టు గుర్తించారు. భాగ్యోదయ్ ఫెర్రో అలాయిస్, భూమికా ఫాయిల్స్, భూషణ్ ఫాయిల్స్ పేరిట డబ్బా కంపెనీలను సృష్టించి, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వాటికి మళ్లించారని విచారణలో గుర్తించారు.

English summary
Three directors of Parekh Aluminex have been arrested by a team of Economic Offences Wing in connection with non-payments of dues estimated at Rs 4000 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X