వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో ఆవిష్కృతమైన చారిత్రాత్మక ఘట్టం...రామమందిరం నిర్మాణంకు శంకుస్థాపన చేసిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

అయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది. శతాబ్దాల తరబడి, చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామమందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. రామమందిరం నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. ఇక అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్ డేట్ మీకోసం

ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్య సింగారించుకుంటోంది.. సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతోంది. భక్తిపూరక వాతావరణాన్ని అణువణువునా నింపుకొంటోంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఎటు చూసినా కాషాయ జెండాలు దర్శనం ఇస్తున్నాయి. జైశ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సాధువులతో నగరం క్రమంగా నిండిపోతోంది. శ్రీరామచంద్రుడి భక్తులు ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు. చాలామంది కాలి నడకన, చెప్పులు లేకుండా రావడం కనిపిస్తోంది. ఏ ఒక్కరిని పలకరించినా.. జైశ్రీరామ్ అంటూ సమాధానం ఇస్తున్నారు.

Ayodhya Bhoomi Puja live updates, PM Modi to lay foundation stone

Newest First Oldest First
4:24 PM, 5 Aug

రామమందిరం నిర్మాణం భూమిపూజ పూర్తయిన సందర్భంగా తన నివాసంలో పనిచేసే సిబ్బందికి స్వీట్లు పంచిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్
4:23 PM, 5 Aug

రామమందిరం నిర్మాణం సందర్భంగా జరిగిన భూమిపూజను ఇండోర్‌లోని బీజేపీ ఆఫీసులో వీక్షించిన లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్
3:37 PM, 5 Aug

మహారాష్ట్ర

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని తన నివాసంలో శ్రీరామచంద్రుల వారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు.
3:34 PM, 5 Aug

హర్యానా

అయోధ్యలో రామమందిరం భూమిపూజ సందర్భంగా స్వీట్లు పంచి పెట్టిన హర్యానా హోం శాఖ మంత్రి అనిల్ విజ్. 500 సంవత్సరాల నాటి స్వప్నం ఫలించింది.. దశాబ్దాల నాటి పోరాటాలు సుఖాంతం అయ్యాయంటూ వ్యాఖ్యలు
3:30 PM, 5 Aug

కర్ణాటక

అయోధ్యలో రామమందిరానికి పునాదిరాయి పడటం ఆనందంగా ఉంది. అపురూపమైన ఆలయం నిర్మితమౌతుంది. వారణాశిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని, కృష్ణ జన్మస్థలమైన మథుర దేవస్థానాన్ని విముక్తం చేయాల్సి ఉంది: కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప
3:26 PM, 5 Aug

అస్సాం

ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు. రామజన్మభూమిలో రామమందిరం నిర్మాణం కోసం దేశ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల కలలను సాకారం చేయడం గర్వంగా ఉంది. శాంతికి, మానవత్వానికి ప్రతీకగా రామమందిరం నిలుస్తుంది: అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్
2:31 PM, 5 Aug

తమిళనాడు

రామమందిర భూమిపూజ సందర్భంగా తమిళనాడులోని కమలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు
2:27 PM, 5 Aug

శ్రీరాముడి ఆలయం భూమి పూజ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
2:25 PM, 5 Aug

మహారాష్ట్ర

భూమి పూజ సందర్భంగా మహారాష్ట్రలోని బీజేపీ ఆఫీసులో రాముడి పాటను పాడిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
2:13 PM, 5 Aug

మరికాసేపట్లో తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న ప్రధాని మోడీ
2:11 PM, 5 Aug

అయోధ్యలో రామమందిర నిర్మాణం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని భావిస్తున్నాను: ప్రధాని మోడీ
2:10 PM, 5 Aug

అయోధ్యలో ముగిసిన ప్రధాని మోడీ ప్రసంగం
2:01 PM, 5 Aug

ప్రపంచ దేశాలు కూడా శ్రీరాముడని పూజిస్తాయి:ప్రధాని మోడీ
2:01 PM, 5 Aug

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ రోజును వేడుకగా జరుపుకుంటున్నారు: ప్రధాని మోడీ
1:59 PM, 5 Aug

రామమందిర నిర్మాణం మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది: ప్రధాని మోడీ
1:58 PM, 5 Aug

శ్రీరాముడు అన్ని చోట్లా ఉన్నాడు.. అందరిలో ఉన్నాడు అనేది నేను బలంగా నమ్ముతాను: ప్రధాని మోడీ
1:53 PM, 5 Aug

చరిత్ర తిరిగి పునరావృతం అవుతోంది ఎలా అయితే గోవర్ధన పర్వతాన్ని ఎత్తడంలో కృష్ణుడికి పిల్లలు సహాయం చేశారో.. ఎలా అయితే గిరిజనులు, మత్స్యకారులు రాముడికి సహాయం చేశారో అలానే నేటి ప్రజలు ఈ ఆలయం పూర్తయ్యేందుకు సహాయం చేస్తారు :ప్రధాని మోడీ
1:53 PM, 5 Aug

భారత దేశం యొక్క ఐక్యత ప్రపంచవ్యాప్తంగా ఒక కేస్ స్టడీగా నిలుస్తుంది: ప్రధాని మోడీ
1:52 PM, 5 Aug

ప్రజల ఆశీర్వాదంతో రామమందిర నిర్మాణం ప్రారంభం అవుతుంది:ప్రధాని మోడీ
1:51 PM, 5 Aug

భారతదేశ నలుమూలల నుంచి ఇటుకలు, నీరు, మట్టిని సేకరిస్తాం: ప్రధాని మోడీ
1:50 PM, 5 Aug

రామజన్మభూమి ట్రస్టు నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను: ప్రధాని మోడీ
1:50 PM, 5 Aug

ఎంతో మంది ప్రాణత్యాగాలకు సాక్ష్యంగా ఈ ఆలయం నిలుస్తుంది: ప్రధాని మోడీ
1:49 PM, 5 Aug

ఈ మహత్కార్యాన్ని వీక్షించడం జన్మ ధన్యమైంది: ప్రధాని మోడీ
1:47 PM, 5 Aug

రామమందిరం దేశం మొత్తాన్ని ఏకం చేస్తుంది. విదేశాల నుంచి సైతం అయోధ్యకు వచ్చి రాముడిని దర్శించుకుంటారు:ప్రధాని మోడీ
1:44 PM, 5 Aug

మన సంస్కృతిని ప్రతిబింబించేది రామమందిరం: ప్రధాని మోడీ
1:43 PM, 5 Aug

హనుమాన్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రామమందిరంకు శంకుస్థాపన చేయడం జరిగింది: ప్రధాని మోడీ
1:40 PM, 5 Aug

రామమందిరం కోసం తరాలు తమ ప్రాణాలను త్యాగం చేశాయి: ప్రధాని మోడీ
1:40 PM, 5 Aug

ఇక నుంచి రాముడి విగ్రహం రామమందిరంలోపలే ఉంటుంది:ప్రధాని మోడీ
1:39 PM, 5 Aug

రామమందిర నిర్మాణం కోసం చేసిన ప్రార్థనలు ఫలించాయి..ఈ రోజు రామమందిరం నిర్మాణంకు శంకుస్థాపన జరిగింది: ప్రధాని మోడీ
1:39 PM, 5 Aug

దేశం మొత్తానికి ఈరోజు ఒక భావోద్వేగమైన రోజు : ప్రధాని మోడీ
READ MORE

English summary
Few hours left for the historic Ramtemple as PM Modi will be laying the foundation stone at Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X