అయోధ్యలో రికార్డులు బద్దలు -5.84లక్షల ప్రమిదలతో దీపోత్సవం -దేశమంతా దీపావళి సంబురాలు

దశాబ్దాల వివాదాలు ముగిసి.. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కూడా జరగడంతో ఈసారి అయోధ్యాపురిలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. ఏటా సరయూ నది తీరంలో.. దీపావళికి ముందు రోజు నిర్వహించే 'దీపోత్సవ్' వేడుక శుక్రవారం సాయంత్రం కన్నులపడువగా సాగింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గతేడాది మొత్తం 4.10 లక్షల మట్టి దివ్వెలను వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పగా.. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ ఏకంగా 5.84 లక్షల ప్రమిదల్ని వెలిగించారు. దీపావళి సందర్భంగా అయోధ్య గత నాలుగేళ్లుగా దీపోత్సవ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Ayodhya Deepotsav makes it to Guinness Book, 5,84,572 diyas lit, Ahead Of Diwali

శుక్రవారం సాయంత్రం అయోధ్యలోని సరయు తీరంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. దీపోత్సవ్ లో లక్షలాది దివ్వెలను వెలిగించినవారిలో రామ్ మనోహర్ లోహియా యూనివర్సిటీ సహా వివిధ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నారు.

 Ayodhya Deepotsav makes it to Guinness Book, 5,84,572 diyas lit, Ahead Of Diwali

దీపోత్సవ్ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. దీపావళి పురస్కరించుకుని అయోధ్య నగరం సుందరంగా మారింది. దేశం నలుమూలల్నించి భక్తులు పెద్దఎత్తున చేరుకున్నారు. పుణ్య, తీర్థక్షేత్రాలతోపాటు దేశం నలుమూలలా దీపావళి సంబురాలు అంబురాన్నంటున్నాయి. కరోనా విలయం వల్ల ఏర్పడిన చీకట్లను జనం ప్రమిదల వెలుగులతో పారదోలే ప్రయత్నం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఈసారి పటాకుల అమ్మకం, కాల్చివేతను నిషేధించాయి.

 Ayodhya Deepotsav makes it to Guinness Book, 5,84,572 diyas lit, Ahead Of Diwali
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+