Ram Mandir: మరికొద్ది గంటల్లో అయోధ్యలో కొలువుదీరనున్న బాల రాముడు

మరికొద్ది గంటల్లో కోట్లాది మంది భారతీయుల స్వప్నం సాకారమవుతోంది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు సర్వం సిద్ధమైంది. రామ్‌లల్లా (Ram Lalla) ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వంగా సుందరంగా ముస్తామైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలు, పూలతో ద్వారాల అలంకరణ, రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య నగరం మెరిసిపోతోంది.

ఈ చారిత్రక వేడుకను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ వేడుక కోసం ఇప్పటికే పలువురు ఆహ్వానితులు అయోధ్యకు చేరుకున్నారు. మిగితా వారంతా సోమవారం తెల్లవారుజామున అయోధ్యకు చేరుకోనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆహ్వానితులు వేడుకలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 10 వేల సీసీ కెమెరాలు, ఏఐ డ్రోన్స్ సిద్ధం చేశారు. ఎన్ఎస్‌జీ సహా పలు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.

Ayodhya Ram Mandir pran-pratishtha today: 10,000 CCTV Cameras Keep Vigil As NSG Snipers, AI Drones

సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1 గంట వరకు కొనసాగనుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. సుమారు 7 వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహా ఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీలు/ఆన్‌లైన్ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి 22న కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవుదినంగా ప్రకటించగా.. పలు రాష్ట్రాలు పూర్తి సెలవును ప్రకటించాయి.

దేశ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ స్క్రీన్లను హిందూ సంఘాలతోపాటు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ మొదలుకొని ప్యారిస్, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో విశ్వహిందూ పరిషత్, పలు హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+