గడువు సమీపించిన వేళ.. అనుమానితుల అరెస్ట్
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది.

Recommended Video

దేశం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రముఖులు చేరుకోవాల్సి ఉన్నందున అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి వాల్మీకీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ సహా అన్ని ప్రయాణ ప్రాంగణాలపై డేగకన్ను వేశారు.
ఈ పరిస్థితుల మధ్య అయోధ్యలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ- టెర్రరిస్ట్ స్క్వాడ్ వారిని అరెస్ట్ చేసింది. అయోధ్యలో వేర్వేరు ప్రాంతాల నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేర్పాటువాద సంస్థ ఖలిస్తానీతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తోన్నారు. ఈ ముగ్గురూ- రాజస్థాన్ సికార్ జిల్లాకు చెందిన ధరమ్‌వీర్, అతని సహచరులుగా చెబుతున్నారు.

ధరమ్‌వీర్‌కు కెనడా కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న సుఖా డంకే, అర్ష్ దాలా గ్యాంగ్‌లతో వారికి సంబంధాలు ఉన్నాయని సమాచారం. అర్ష్ దాలాను ఇదివరకే జాతీయ భద్రత సంస్థ వాంటెడ్ క్రిమినల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఉత్తరప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications