అయోధ్య రాములోరి ఆలయానికి 42 బంగారు తలుపులు..
అయోధ్య రాములోరి ఆలయానికి స్వర్ణ ద్వారాలు ఆకట్టుకుంటున్నాయి. అయోధ్య ఆలయంలో 42 బంగారు తలుపులను ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకోసం వందకిలోల బంగారంతో తలుపులకు పసిడి పూత పూయడం జరిగింది. ఇక, ఆలయంలోని మొదటి బంగారు తలుపు చిత్రాలను ఇటీవలే ఆలయ ట్రస్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆలయ తలుపులు భక్తులకు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నట్లు వీటిని డిజైన్ చేయడం జరిగింది.
జనవరి 22న జరిగే మహత్తర కార్యానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఇక్కడ జరిగే ప్రాణప్రతిష్ట వేడుక కోసం యావత్ భారతదేశమంతా ఎంతగానో ఎదురుచూస్తుంది. ఈ తరుణంలో అయోధ్య రామాలయానికి సర్వం సిద్ధమవుతోంది. అయోధ్య రామాలయానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం భక్తులకు ఎంతగానో అవసరం.

Recommended Video

ఈ క్రమంలో అయోధ్య రామాలయానికి మొత్తం 42 బంగారు తలుపులను ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యలోని రామాలయానికి మొత్తం 46 ద్వారాలుంటాయి. రామలయంలోని గుడిమెట్ల దగ్గర ఉండే నాలుగు ద్వారాలు మినహాయించి మిగిలిన వాటికన్నింటికి బంగారు పూత పూయడం జరిగింది. ఈ తలుపుల కోసం ఏకంగా వంద కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఇప్పటికే మొదటి బంగారు ద్వారం ఫోటోలను కూడా విడుదల చేశారు.
ఇప్పటికే 11వేల మంది అతిథులకు ఆహ్వానం..
ఈ బంగారు తలుపుల ఫోటోలు భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయోధ్య బలరాముని వైభవం ఎలా ఉండనుందో తెలియజేసే విధంగా ఈ స్వర్ణపు ద్వారాల నిర్మాణం ఉండబోతుంది. ఈ తలుపులు పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటాయి. వీటిపై రెండు ఏనుగులు భక్తులను స్వాగతం పలుకుతూ ఉన్నట్లు కనిపిస్తుంటాయి. బంగారు ద్వారం పై భాగంలో రాజభవనం దానికి అటు ఇటూ ఇద్దరు ద్వారపాలకులు నిలబడి భక్తులను ఆహ్వనిస్తూన్నట్లుగా ఉంటాయి.
ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ఇక, ఇప్పటికే బలరాముని విగ్రహం అయోధ్యకు చేరుకున్నవిషయం అందరికీ తెలిసిందే. ఈ మహత్తర కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే 11వేల మంది అతిథులకు ఆహ్వానపత్రికలు అందాయి. ఈనెల 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు హాజరవ్వాలంటే అయోధ్య ఆహ్వాన పత్రిక ఉండాల్సిందే.












Click it and Unblock the Notifications