అయోధ్య రామాలయ మరమ్మతులకు సుప్రీం ఓకె
న్యూఢిల్లీ: రామ భక్తులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్న వివాదాస్పద రామ్‌లాలా ఆలయం మరమ్మతులకు కోర్టు సోమవారం అనుమతించింది.
ఆలయ పైకప్పులు బాగు చేసుకోవచ్చని చెబుతూ.. భక్తులకు ఇతర సౌకర్యాల కల్పనకు సైతం సుప్రీంకోర్టు అనుమతించింది. ఫైజాబాద్ కలెక్టర్ సహా ఇద్దరు స్వతంత్ర పర్యవేక్షకుల సమక్షంలో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది.

రామమందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలో విజ్ఞప్తి చేశారు. రామమందిరం ఆవరణలో తాగునీరు, టాయ్‌లెట్స్ లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఏర్పాట్లు చేయడం లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications