Ayodhya verdict : చారిత్రాత్మక తీర్పు... మసీదు నిర్మాణానికి సహకరించండన్న బాబా రాం దేవ్
అయోధ్య వివాదంపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువరించింది. ఇది చాలా చారిత్రాత్మక జడ్జ్ మెంట్ అని ఆధ్యాత్మిక , యోగా గురువు రాం దేవ్ బాబా పేర్కొన్నారు. ఈ రోజు అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత స్పందించిన ఆయన కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అటు రాజకీయ నాయకులు, ఇటు ఆధ్యాత్మిక గురువులు స్పందిస్తున్నారు. అయోధ్యలో వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించటం పట్ల ఆధ్యాత్మిక గురువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అయోధ్య వివాదం పై రామ మందిరం విషయంలో గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు రాందేవ్ బాబా. రాముడు అయోధ్యలో పుట్టిన సంగతి అందరికి తెలిసిందే అని, ఆ విషయాన్నీ ప్రతి ఒక్కరు అంగీకరిస్తారని పేర్కొన్నారు. అయోధ్యలోనే రామ మందిరం నిర్మించాలని అన్నారు.
ఆయన అప్పుడు ప్రదర్శించిన విశ్వాసం ఇప్పుడు నిజమైంది. ఇక దీంతో రాం దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చారిత్రాత్మక తీర్పు. గొప్పగా రామాలయ నిర్మాణం జరుగుతుంది. ముస్లిం వైపు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలనే నిర్ణయం స్వాగతించదగినది, మసీదు నిర్మాణంలో కూడా హిందూ సోదరులు సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను అంటూ చాలా సహృదయంతో మాట్లాడారు.
ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా అయోధ్య తీర్పుపై తమ స్పందనను తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఈ తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదు. ఎక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రగిలకుండా ప్రతిఒక్కరు శాంతి , సంయమనం అంటూ తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం దొరకని సమస్యలా ఉన్న అయోధ్య వివాదానికి ఈరోజు ముగింపు పలకడం, తుది తీర్పును వెల్లడించడం పట్ల ఒక శాంతి కాముక వాతావరణం ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఈ తీర్పుపై యోగా గురువు రాం దేవ్ బాబా హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications