Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్య తీర్పు: పినరయి శాంతి మంత్రం, ఆ క్రెడిట్ సుప్రీంకేనన్న శివసేన.. బెంగళూరులో ఆంక్షలు

అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనమంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. తీర్పు నేపథ్యంలో ద్వేషం, అసూయ భావనలు కల్పించొద్దని కోరారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారని వివరించారు.

శివసేన రియాక్షన్

మరోవైపు అయోధ్య తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో శివసేన కూడా స్పందించింది. అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ ప్రభుత్వం అలా చేయదని పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తోందని.. కానీ ఆ క్రెడిట్ సర్వోన్నత న్యాయస్థానానికే చెందుతుందన్నారు. ప్రభుత్వం తీసుకోవడానికి వీలులేదని చెప్పారు.

ఆంక్షలు అమలు

అయోధ్య తీర్పు నేపథ్యంలో బెంగళూరులో ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. రహదారుల్లో నలుగురు గుమికూడి ఉండొద్దని స్పష్టంచేశారు.

నిఘానీడలో..

సోషల్ మీడియాను నిశీతంగా గమనిస్తామని స్పష్టంచేశారు. ఎలాంటి పోస్టులు పెట్టొద్దని.. లైకులు, షేర్ కూడా చేయొద్దని స్పష్టంచేశారు. తీర్పు నేపథ్యంలో మద్యం దుకాణాలు కూడా మూసివేస్తామని ప్రకటించారు. అర్ధరాత్రి వరకు మందుషాపులు క్లోజ్ ఉంటాయని తేల్చిచెప్పారు.

ఉత్కంఠ..

ఉత్కంఠ..

అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్లుగా సాగుతుంది. దీనిపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చాలా పిటిషనర్లు ఇంప్లీడ్ అయ్యారు. భూ వివాదం పరిష్కారం కోసం కమిటీని కూడా నియమించారు. తర్వాత 40 రోజులపాటు సుప్రీంకోర్టు వాదనలు అలకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో తీర్పు వెలువరిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 9వ తేదీన శనివారం తీర్పునిస్తామని స్పష్టంచేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+