జల్సాలు చేసినప్పుడో: పారిస్ ఉగ్రదాడిపై అజంఖాన్
లక్నో: సమాజ్‌వాది పార్టీ ముఖ్య నేత, మంత్రి అజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిని ఆయన గుర్తు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పారిస్‌లో దాడిని ఖండిస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సిరియా, ఇరాక్ తదితర దేశాల్లోని చమురు క్షేత్రాలను ఆక్రమించి, ఆ డబ్బుతో పారిస్‌లో జల్సాలు చేసిన రోజున, ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదా? అని ఆజంఖాన్ ప్రశ్నించారు. ఐసిస్ అడ్డాలుగా భావించి, వైమానిక దాడులు చేస్తూ అమెరికా, దాని మిత్రదేశాలు అమాయకులను బలి చేస్తున్నాయని ఆరోపించారు.

అగ్రరాజ్యాలు తమపై చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఉగ్రదాడులు జరుగుతున్నాయని, ఈ తరహా ఘటనలు దురదృష్టకరమని అన్నారు. చమురు నిల్వలను దోచుకుని, ఆ డబ్బుతో యూరప్ దేశాల్లో దీపాలను వెలిగించుకోవడం తగదన్నారు.












Click it and Unblock the Notifications