Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంలో ఆ నేత రికార్డు.. ఇప్పుడే కాదు అప్పుడు కూడా..

అలీఘడ్ : ఒకరి గుణగణాలు పరిశీలించాలంటే అధికారం ఇచ్చి చూడాలి అంటారు. అధికారం ఇవ్వడం సంగతి పక్కన పెడితే .. వారి వ్యక్తిత్తం చిన్నప్పటి నుంచి ఓకేలా ఉంటుంది. పెద్దయ్యాక మారదు. అందుకే టీచర్లు క్రమశిక్షణ, సమయపాలన అని పదే పదే చెప్తుంటారు. సరిగ్గా అలాంటి నిబంధన కొందరు పోకిరీలకు వర్తిస్తోంది. అయితే వారిలో రాజకీయ నేతలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దురుసు స్వభావం గల కొందరు నేతలు విద్యార్థి దశ నుంచే గొడవలు చేస్తూ చెడుపేరును తెచ్చుకుంటారు. వారిలో ముందువరుసలో నిలిచే వ్యక్తి ఎస్పీ నేత, ఎంపీ అజాంఖాన్.

అజాంఖాన్ .. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ నేత జయప్రదపై కాంట్రవర్సీ కామెంట్లు చేసి ఎన్నికల సంఘం చేత మొట్టికాయలు వేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన నోటిదురుసుతో రెండుసార్లు ఈసీ ప్రచారాన్ని కూడా నిలిపివేసింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవల లోక్‌సభలో ప్రొటెం స్పీకర్ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దుమారం చెలరేగింది. అయితే విద్యార్థి దశలోనే అజాంఖాన్ కాంట్రవర్సీ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది.

Azam Khan was expelled from AMU for trying to enter female ward

ఏం జరిగిందంటే ..
అజాంఖాన్ అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో లా తర్వాత ఎల్ఎల్ఎం చదువుతున్నారు. వర్సిటీలో దుందుకుడు స్వభావం ఉన్న ఆయన ఎఎంయూ కార్యదర్శిగా కూడా ఉన్నారు. అయితే ఒకరోజు వర్సిటీ పరిధిలోని ఓ ఆస్పత్రిలోకి దూసుకొచ్చారు అజాంఖాన్. మహిళల వార్డు అని చెప్తున్న వినకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని సిబ్బంది వర్సిటీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వీసీ, రిజిస్ట్రార్ అజాంఖాన్‌ను సస్పెండ్ చేశారు. ఏడాదిపాటు వర్సిటీ నుంచి సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ఫిమెల్ వార్డులోకి అజాంఖాన్ వెళ్లేందుకు ప్రయత్నించారని రుజువైంది. ఈ మేరకు నివేదిక సమర్పించడంతో .. ఖాన్‌పై వేటుపడింది. అయితే విచిత్రంగా అదే ఏడాది దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. దీంతో మరోసారి జైలుకు వెళ్లారు అజాంఖాన్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+