అజారుద్దీన్‌ కారు బోల్తా .. ఫ్యామిలీతో వెళ్తుండగా యాక్సిడెంట్... సేఫ్

కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ కారుకు ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులతో కలిసి రణ్‌తంబోర్ నుంచి వస్తోండగా బోల్తా పడింది. అయితే ప్రమాదం నుంచి అజార్, ఫ్యామిలీ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని అజారుద్దీన్ పర్సనల్ సెక్రటరీ మీడియాకు తెలిపారు. ప్రమాదంలో కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఆ ఫోటోలు చూస్తే మాత్రం కాస్త భయంగానే కనిపిస్తోంది.

అజారుద్దీన్‌ కారు బుధవారం ఉదయం ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజస్తాన్ పర్యటనలో ఉండగా ఘటన జరిగింది. అజారుద్దీన్ ఫ్యామిలీతో కలిసి రణ్‌తంబోర్ తిరిగి వస్తుండగా రాజస్థాన్‌లోని సూర్వల్ వద్ద గల లాల్సాట్-కోట హైవేపై ప్రమాదం జరిగింది.

azharuddin escapes unhurt in car accident in rajasthan

కారు బోల్తా పడింది. కానీ అందులో ఉన్న వారు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం నుంచి తేరుకున్న అజారుద్దీన్‌ వేరే కారులో హోటల్‌కు వెళ్లిపోయారు. అజారుద్దీన్ భారత్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అజార్ భారత జట్టు తరఫున 99 టెస్ట్ మ్యాచ్‌లను ఆడారు. 1992 నుంచి 1999 వరకూ భారత క్రికెట్ జట్టు తరఫున మూడుసార్లు ఐసీసీ వరల్డ్ కప్‌ పోటీలకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+