బెంగళూరుకు వరప్రదాయిని..!!
కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వం అతి భారీ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకుంది. దీని సామర్థ్యం 1,000 పడకలు. పేదలకు ఉచితంగా అవయవ మార్పిడి కోసం ఈ ఆసుపత్రిని నిర్మించబోతోంది. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ తక్షణమే చేపట్టనుంది. బెంగళూరులో ఏర్పాటు కానున్న ఈ 1,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ భాగస్వామ్యం కానుంది.
దశలవారీగా ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తుంది. ఇందులో అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 1,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. వైద్య విద్య శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ దీనికి సంబంధించిన వివరాలను ఇదివరకే వెల్లడించారు. తాజాగా ఫౌండేషన్ దీనిపై స్పందించింది. భాగస్వామ్యం కానున్నట్లు తెలియజేసింది. బెంగళూరు నిమ్హాన్స్ సమీపంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ఆసుపత్రి నిర్మాణానికి 99 సంవత్సరాల లీజుకు కేటాయిస్తారు. నిర్మాణం, నిర్వహణ ఖర్చులన్నింటినీ ఫౌండేషన్ భరిస్తుంది.

ఆసుపత్రి స్థాపనకు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 1,000 కోట్ల రూపాయలను కేటాయించిందని శరణ్ ప్రకాష్ పాటిల్ తెలిపారు. వార్షిక నిర్వహణకు దాదాపు 350 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని చెప్పారు. కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు వంటి అవయవ మార్పిడులకు అత్యాధునిక చికిత్సా సదుపాయాలు ఇక్కడ లభిస్తాయి. ప్రాజెక్టు దశలుగా అమలవుతుంది. మొదటి దశలో మూడేళ్లలో 350 పడకలతో ఆసుపత్రి సిద్ధమవుతుంది. ఆ తర్వాత అయిదేళ్లలో సామర్థ్యం 1,000కి విస్తరిస్తుంది.
ఈ ఆసుపత్రిలో 70 శాతం పడకలు పేద రోగులకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. మిగిలిన 30 శాతం పడకలు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య కర్ణాటక పథకం కింద కవర్ అవుతాయి. కర్ణాటకలో అవయవ మార్పిడికి భారీ డిమాండ్ ఉంది. బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంటరాలజీ సైన్సెస్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ 2016 నుండి లివర్ మార్పిడులు చేస్తోంది. కొత్త ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు ఈ కేంద్రం నిర్వహణను ఫౌండేషన్ కు అప్పగించే విషయంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications