కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం, 56వేలకోట్ల రైతు రుణాల మాఫీ ప్రకటన

బెంగళూరు: గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. కాగా, ఆయననొక్కరే గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కాగా, తాము హామి ఇచ్చిన ప్రకారం రూ.56వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామని యడ్యూరప్ప స్పష్టం చేశారు. దీనిపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

దీంతో కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ శాసనసభపక్షనేత యడ్యూరప్పను గవర్నర్‌ వజూభాయ్‌ వాలా ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈలోగా విశ్వాసపరీక్షను ఎదురుకోవాలన్నారు.

ఈ నేపథ్యంలోనే గురువారం యడ్యూరప్ప 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకు 7సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన యడ్యూరప్ప.. 2007, 2008లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

B S Yeddyurappa to be sworn in at 9am

బలనిరూపణ తర్వాత యడ్యూరప్ప తన మంత్రి వర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, ప్రకాశ్ జవదేకర్‌లు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని అనుకున్నా.. వారు గైర్హాజరయ్యారు.

మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్‌ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమకు అవసరమైన బలముందని లేఖలు సమర్పించినా.. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్, జేడీఎస్‌ తీవ్రంగా ఖండించాయి.

గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును తక్షణమే విచారణకు స్వీకరించాలని సీజేఐని కోరింది. అయితే, అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించడంలో ఎలాంటి తప్పూ లేదని, ఆ ప్రక్రియను అడ్డుకోవడం కుదరని స్పష్టం చేసింది.

దీంతో యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లయింది. అటు, కాంగ్రెస్, జేడీఎస్‌ రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్‌ రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి. బలనిరూపణ పరీక్ష వరకు ఎమ్మెల్యేలను ఇక్కడే ఉంచనున్నారు. అంతేగాక, ఎమ్మెల్యేల ఫోన్లను కూడా తీసుకున్నాయి కాంగ్రెస్, జేడీఎస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+