రాంపాల్‌పై రాందేవ్, రవిశంకర్ ఫోన్ కట్: భక్తులు రివర్స్

న్యూఢిల్లీ: రాంపాల్ బాబా వంటి వారి బహిష్కరించాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ గురువారం పిలుపునిచ్చారు. రాంపాల్ పైన రామ్‌దేవ్ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హర్యానాలోని హిస్సార్‌లో గల రాంపాల్ ఆశ్రమం వద్ద కొద్ది రోజుల పాటు ఉద్రిక్తత ఉన్న విషయం తెలిసిందే.రాంపాల్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు, ఆయన అనుచరులకు మధ్య కాల్పులు జరగిగాయి. ఆశ్రమంలో మృతదేహాలు కూడా బయటపడ్డాయి. దీని పైన రామ్‌దేవ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేవి కావన్నారు. ఇలాంటి స్వామీజీలను ప్రజలు బహిష్కరించాలన్నారు.

అంతకుముందు ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఈ ఘటనను ఖండించారు. నాయకులైనా, ఎవరైనా తాము చట్టాని కంటే ఎక్కువ అని భావించరాదన్నారు. సింప్లిసిటీ, త్యాగాలు నాయకత్వానికి ప్రతీక అన్నారు. ఇలాంటి ఘటనలు సరికావన్నారు. తాను రాంపాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ ఆయన సెక్రటరీ ఫోన్ కట్ చేశారని బుధవారం శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. కాగా, రాంపాల్ బాబాకు కోర్టు 28వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. రాష్ట్రంలోని మిగతా బాబాల వివరాలు తెప్పించుకోవాలని కోర్టు పోలీసులకు సూచించింది. హిసార్ ఆపరేషన్ పైన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

ఎదురు తిరిగిన భక్తులు!

తమను బలవంతంగా ఆశ్రమం లోపల కూర్చోబెట్టారని, బయటకు వెళ్ళాలని చూస్తే కాల్చి చంపేస్తామని రాంపాల్ అనుచరులు బెదిరించారని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన భక్తులు వాపోయారు. బర్వాలాలోని ఆయన ఆశ్రమంలో చాలామంది ఉన్నారని వివరించారు. నాలుగు రోజులుగా తాము నరకం అనుభవించామని పేర్కొన్నారు.

 రాంపాల్‌పై రామ్‌దేవ్ నిప్పులు, రవిశంకర్ ఫోన్ చేస్తే కట్!

రాంపాల్‌పై రామ్‌దేవ్ నిప్పులు, రవిశంకర్ ఫోన్ చేస్తే కట్!

రాంపాల్ బాబా వంటి వారి బహిష్కరించాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ గురువారం పిలుపునిచ్చారు. రాంపాల్ పైన రామ్‌దేవ్ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాంపాల్‌పై రామ్‌దేవ్ నిప్పులు, రవిశంకర్ ఫోన్ చేస్తే కట్!

రాంపాల్‌పై రామ్‌దేవ్ నిప్పులు, రవిశంకర్ ఫోన్ చేస్తే కట్!


ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ కూడా ఈ ఘటనను ఖండించారు. నాయకులైనా, ఎవరైనా తాము చట్టాని కంటే ఎక్కువ అని భావించరాదన్నారు.

రాంపాల్

రాంపాల్

వివాదాస్పద బాబా రాంపాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు పంచకులలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆయనను సత్ లోక్ ఆశ్రమంలో పోలీసులు అరెస్టు చేశారు.

రాంపాల్

రాంపాల్

వివాదాస్పద రాంపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పంచకులలోని జనరల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తున్న దృశ్యం.

జైల్లో..

జైల్లో..

వివాదాస్పద బాబా రాంపాల్‌ను గురువారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పంచకులాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. అంతకు ముందే అక్కడి హైకోర్టు రాంపాల్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. రాంపాల్‌పై సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, బలవంతంగా భూముల ఆక్రమణ మొదలైన కేసులు నమోదు అయ్యాయి.

రాంపాల్‌పై రామ్‌దేవ్ నిప్పులు, రవిశంకర్ ఫోన్ చేస్తే కట్!

రాంపాల్‌పై రామ్‌దేవ్ నిప్పులు, రవిశంకర్ ఫోన్ చేస్తే కట్!


వివాదాస్పద బాబా రాంపాల్‌ను హర్యానా పోలీసులు న్యాయస్థానానికి తీసుకు వస్తున్న దృశ్యం. ఆయనకు కోర్టు 28వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+