బాబా షాక్: ఎవరూ ఊహించలేదు.. అందరి ముందే మర్మాంగం కోసుకున్నాడు..
రాజస్థాన్ లోని సంతోష్ దాస్ (30) అనే బాబా కూడా తన మర్మాంగాన్ని తానే కోసేసుకున్నాడు.
జైపూర్: అత్యాచారాల కేసుల్లో పట్టుబడుతున్న బాబాలు తాము నపుంసకులమని చెప్పుకోవడం చాలా కేసుల్లో జరుగుతున్నదే. సాధ్వీలపై రేప్ కేసులో ఇటీవలే పట్టుబడ్డ డేరా బాబా, ఓ న్యాయ విద్యార్థిపై అత్యాచారం కేసులో పట్టుబడ్డ కేరళ స్వామిజీ గణేశానంద కూడా ఇవే మాటలు చెప్పారు.
తాజాగా రాజస్థాన్ లోని సంతోష్ దాస్ (30) అనే మరో బాబా కూడా ఇదే వాదనను తెర పైకి తెచ్చాడు. తారానగర్‌లో ఉండే ఈ వ్యక్తి కొంత కాలం క్రితం తనను తాను బాబాగా ప్రకటించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా స్థానికులు గుర్తించారు.

ఇదే విషయం బాబాకు తెలియడంతో.. తనకెలాంటి అక్రమ సంబంధాలు లేవని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేనా.. అక్కడికక్కడే తన జననాంగాన్ని కోసేసుకుని అందరిని విస్మయపరిచాడు. దీంతో వెంటనే అతన్ని బికనీర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications