హిట్ లిస్ట్‌లో సల్మాన్ ఖాన్: రంగంలో దిగిన కిల్లింగ్ గ్యాంగ్

Baba Siddique: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ దారుణ హత్యకు గురి కావడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఎన్నికల ముంగిట్లో ఉన్న మహారాష్ట్ర రాజకీయాల్లో సునామీ పుట్టించింది. అధికారంలో ఉన్న శివసేన- భారతీయ జనతా పార్టీ- ఎన్సీపీ కూటమి ఆత్మరక్షణలో పడింది.

ఇద్దరి అరెస్ట్..

బాబా సిద్ధిక్ హత్యకేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కర్నాల్ సింగ్, ధరమ్ రాజ్ కశ్యప్‌గా గుర్తించారు. వారి అరెస్ట్‌ను ముంబై అదనపు పోలీస్ కమిషనర్ పరంజిత్ సింగ్ దహియా ధృవీకరించారు.

Baba Siddique murder case Security enhanced at actor Salman Khan s residence

మరొకరి కోసం గాలింపు..

బాబా సిద్ధిక్ హత్య కేసులో మొత్తం ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు కర్నాల్ సింగ్, ధరమ్ రాజ్ కశ్యప్‌‌ను అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తోన్నామని అన్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే?

కరడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారిగా అనుమానిస్తోన్నారు. ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు కూడా ఈ కేసు దర్యాప్తులో భాగస్వామ్యం కావడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. వారికి సుపారీ ఎవరిచ్చారు? ఆయుధాలు ఎక్కడి నుంచి అందాయి? వాటిని ఎవరు పంపించారు? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు.

సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రత..

బాబా సిద్ధిక్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎప్పటి నుంచో ఈ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Baba Siddique murder case Security enhanced at actor Salman Khan s residence

వాహనాల తనిఖీ..

ముంబై బాంద్రా వెస్ట్ బంద్ స్టాండ్ ప్రొమోనెడ్, బైరామ్‌జీ జీజీభాయ్ రోడ్‌లో ఉంటుంది సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తోన్న గెలాక్సీ బంగ్లా. ఈ తెల్లవారు జాము నుంచి ఈ బంగ్లా ముందు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పికెటింగ్ నెలకొల్పారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేస్తోన్నారు.

బెదిరింపులు, కాల్పులు

గతంలో సల్మాన్ ఖాన్‌కు పలుమార్లు బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పైనా కాల్పులు జరిపిన ఉందంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురైనప్పటి నుంచీ ఆయనకు బెదిరింపు ఫోన్లు, మెయిల్స్ అందుతూనే వస్తోన్నాయి.

హిట్‌ లిస్ట్‌లో..

సల్మాన్ ఖాన్‌‌ను టార్గెట్‌‌గా చేసుకున్నారు గ్యాంగ్‌స్టర్లు. ఆయనను హత మార్చడమే త‌న‌ ల‌క్ష్య‌మంటూ ఇదివరకే లారెన్స్ బిష్ణోయ్ ప్ర‌క‌టించుకున్నాడు కూడా. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరు వ్యక్తులు నేరుగా సల్మాన్ ఖాన్ ఇంటిపైనా కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+