డిసెంబర్ 6న భారీ ఉగ్ర దాడికి ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు..
నవంబర్ 10 సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. మరికొంత మంది క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్. ఉమర్ నబీ ప్లాన్ ను అధికారులు బట్టబయలు చేశారు. ఉమర్ నబీ.. డిసెంబర్ 6 న అంటే బాబ్రీ మసీద్ కూల్చివేత రోజున భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ వేసినట్లు అధికారులు తెలిపారు. కానీ నవంబర్ 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో అతడు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
దిల్లీ బ్లాస్టుకు చెందిన కేసులో సుమారు 8 మందిని విచారించిన తర్వాత డాక్టర్ నబీ ప్లాన్ తెలిసినట్లు పేర్కొన్నారు. ఫరీదాబాద్ కేంద్రంగా సాగుతున్న అంతర్ రాష్ట్ర వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌తో డాక్టర్ నబీకి లింకు ఉన్నట్లు చెప్పారు. పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ నబీ .. నవంబర్ 10న ఎర్రకోట్ వద్ద కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
దిల్లీ పేలుడులో ప్రధాన నిందితుడుగా ఉన్న డాక్టర్. ఉమర్ నబీ.. దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాకు చెందినవాడు. అతడు కాశ్మీర్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ లో పలు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే జైషే-ఈ- మహ్మద్ టెర్రర్ మాడ్యులింగ్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా ఉన్నాడు. అయితే అల్ ఫలా విశ్వవిద్యాలయంలో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైబ్ అరెస్ట్ కావడంతో ప్లాన్ అడ్డం తిరిగింది. అతడి క్వార్టర్స్ నుంచి పోలీసులు.. 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే డాక్టర్. ఉమర్ నబీ.. డిసెంబర్ 6 న అంటే బాబ్రీ మసీద్ కూల్చివేత రోజున ఆత్మాహుతి దాడికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. అయితే అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన మరో ఇద్దరు డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహీన్ షాహిద్ ను 2,900 కిలోల పేలుడు పదార్థాల కేసులో ఫరీదాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దీంతో అతడి ప్లాన్ బెడిసికొట్టింది.
ఇక ఇటీవల కాశ్మీర్ వెళ్లిన ఉమర్.. తన స్నేహితులతో.. తాను మూడు నెలలపాటు అందుబాటులో ఉండనని తెలిపినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఎటాక్ తర్వాత ఉమర్ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోందని అధికారి తెలిపారు. ఇక దర్యాప్తులో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉమర్ మంచి మెరిట్ విద్యార్థి.. అయితే 2021లో తనకు పరిచయం అయిన గనై అనే వ్యక్తితో కలిసి టర్కీ వెళ్లొచ్చాక అతడిలో ఉగ్రవాద లక్షణాలు బయటపడ్డాయి. అలాగే అల్ ఫలా యూనివర్సిటీ పరిధిలోని చాలా ప్రాంతాల్లో వీళ్లిద్దరూ కలిసి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ను దాచి ఉంచినట్లు విచారణలో తేలింది.

ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సమయంలో ఎర్రకోట వద్ద బ్లాస్టర్ కు ఉమర్ యత్నించినట్లు ఈ మేరకు పలుమార్లు ఎర్రకోట ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే ఉమర్, గనైన్ ల పాస్ పోర్టులపై టర్కీ ఇమ్మిగ్రేషన్ స్టాంపులు ఉండటంపై.. ఈ కుట్రలో అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గనై కూడా ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తును వేగవంతం చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications