ఇదేమీ చిత్రం.. కరోనా కాలంలో జన్మించిన వారు ఇలా చేస్తారట..
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కరోనా వైరస్ వల్ల బాగా అర్థం అవుతుంది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటీ నుంచి మాస్క్ ధరించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి మన జీవితంలో నిత్యకృత్యం అయ్యాయి. పెద్దలతో పాటు చిన్నారులు కూడా వీటిని పాటిస్తున్నారు.

ఈ అలవాట్లు చిన్నారులపై.. ముఖ్యంగా కరోనా కాలంలో జన్మించిన చిన్నారులపై ఎంత ప్రభావం చూపాయో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఈ వీడియోని 1.8మిలియన్ల మంది చూశారు. ఆ వివరాలు.. ప్రస్తుతం షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు ఇలా ప్రతి చోటా శానిటైజర్ స్టాండ్‌లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్లాలంటే తప్పకుండా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాల్సిందే. ఈ క్రమంలో ఓ చిన్నారి తనకు కనిపించిన లాంప్ పోస్ట్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, లాన్‌లో ఉన్న లైట్ స్టాండ్, ఆఖరకు గార్డెన్‌లో ఉన్న చిన్న గోడ.. ఇలా తనకు కనిపించిన ప్రతి దాన్ని శానిటైజర్ స్టాండ్‌గా భావిస్తుంది.
దాని దగ్గరకు వెళ్లి.. వాటిని తడిమి.. చేతిలో శానిటైజర్ పడినట్లు భావిస్తుంది. ఆ తర్వాత చేతులను రుద్దుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. బేబీగ్రామ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీన్ని చూసిన వారిలో చాలా మంది మా పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారు. శానిటైజర్ డబ్బా కనిపిస్తే చాలా చేతులు చాస్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. ఎంతో అమాయకంగా ఉన్న ఈ చిన్నారి చేష్టలు బలే ముద్దుగా ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications