ఉబెర్ క్యాబ్ లో ప్రసవం: పాపకు అదే పేరు
న్యూఢిల్లీ: అవసరానికి ఒక్క అంబులెన్స్ రాకపోవడంతో చివరికి క్యాబ్ లో వెళుతున్న మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే సరైన సమయంలో ఆదుకున్న ఆ ఉబెర్ క్యాబ్ కంపెనీ పేరు ఆబిడ్డకు పెట్టాలని పాప కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో బాబ్లీ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె నిండు గర్బిణి. గురువారం రాత్రి పురిటి నొప్పులు ఎక్కవ కావడంతో పలు అంబులెన్స్ సర్వీసులకు ఫోన్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమయానికి బాబ్లీ భర్తకూడా అక్కడ లేదు.
బాబ్లీ పక్కింట్లో ఉన్న ఇద్దరు మహిళలు ఆమెకు తోడుగా ఉన్నారు. అదే సమయంలో షానవాజ్ అనే వ్యక్తి ఉబెర్ క్యాబ్ తీసుకుని అటు వైపు వెళ్లారు. వారు క్యాబ్ ను నిలిపి ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. అంబులెన్స్ ను పిలుస్తానని షానవాజ్ చెప్పారు.

ఒక గంట నుంచి తాము అంబులెన్స్ ల కోసం ఫోన్ లు చేసినా ఫలితం లేదని వారు వాపోయారు. బాబ్లీని తీసుకుని క్యాబ్ లో ఆసుపత్రి దగ్గరకు బయలుదేరారు. అయితే మార్గం మద్యలోనే బాబ్లీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
షానవాజ్ తల్లీ బిడ్డను తీసుకుని సప్తార్ జంగ్ ఆసుపత్రికి చేరుకున్నాడు. వెంటనే తల్లి బిడ్డను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. మొదట షానవాజ్ బాబ్లీ భర్త అని వైద్యులు అనుకున్నారు.
చివరికి విషయం తెలుసుకున్న వైద్యులు షానవాజ్ ను అభినందించారు. మమ్మల్ని క్షేమంగా రక్షించిన ఉబెర్ క్యాబ్ పేరే తన బిడ్డకు పెట్టుకుంటానని బాబ్లీ అంటున్నది. ఆదివారం జరగనున్న నామకరణ మహోత్సవంలో షానవాజ్ ఆ బిడ్డకు నామకరణం చెయ్యనున్నాడు.












Click it and Unblock the Notifications