తొండంతో పుట్టిన చిన్నారి: వినాయకుడని పూజలు

అలీఘర్: ఏనుగు తొండం ఆకారం లాంటి భాగంతో ఓ చిన్నారి జన్మించింది. ఆమెను వినాయకుడి అవతారంగా భావించి పలువురు పూజలు చేస్తున్నారు. ఆమెను చూసేందుకు తండోపతండాలుగా జనాలు బారులు తీరుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో చోటు చేసుకుంది.

Baby born with 'elephant trunk' in Aligarh worshiped as Lord Ganesha

కాగా, ఆ చిన్నారి అత్త ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘మా కోడలు ఒక చిన్నారికి జన్మనిచ్చింది. ఆమె ఖచ్చితమైన పోలికలతో వినాయకుడిలా వుంది. ప్రతీ ఒక్కరూ ఆమెను వినాయకుడి అవతారంగా చెబుతున్నారు. అంతేగాక, ఆమె చుట్టూ ప్రదిక్షణలు చేసి తమ కోరికలను తెలుపుకుంటున్నారు' అని తెలిపింది.

ఆ చిన్నారి ముక్కుకు కొంచెం పక్కగా ఈ తొండం లాంటి భాగం వుంది. తొండం కారణంగా చిన్నారి ముక్కు రెండుగా విడిపోయి ఉంది. కాగా, ఆ చిన్నారిని పరిశీలించిన వైద్యులు, ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఎదురైతే.. అవసరమైన శస్త్ర చికిత్సలు చేపడతామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+