వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు కాళ్లు.. రెండు పురుషాంగాలు: వింత శిశువు జననం..

రాయిచూర్ జిల్లాలోని పులదిన్ని గ్రామానికి చెందిన చెన్నబసవ(26), లలితమ్మ(23) దంపతులకు నాలుగు కాళ్లు, రెండు పురుషాంగాలతో వింత శిశువు జన్మించాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నాలుగు కాళ్లు, రెండు పురుషాంగాలతో ఓ మహిళకు వింత శిశువు జన్మించాడు. రాయిచూర్ జిల్లాలోని పులదిన్ని గ్రామానికి చెందిన చెన్నబసవ(26), లలితమ్మ(23) దంపతులకు శనివారం నాడు ఈ వింత శిశువు జన్మించాడు.

సాధారణ డెలివరీ ద్వారానే లలితమ్మ శిశువును ప్రసవించింది. నాలుగు కాళ్లు, రెండు పురుషాంగాలు ఉండటంతో.. విమ్స్(విజయనగర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు) కు తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో శిశువును విమ్స్ కు తరలించేందుకు తొలుత లలితమ్మ నిరాకరించింది.

Baby born with four legs and two male sex organs

అనంతరం డాక్టర్ల ఒత్తిడితో శిశువును విమ్స్ కు తరలించేందుకు లలితమ్మ ఒప్పుకుంది. దీంతో చిన్నారిని విమ్స్ కు తరలించి ప్రత్యేక వార్డులో చేర్పించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్సల ద్వారా చిన్నారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వైద్యులు స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన శిశువు తల్లి లలితమ్మ.. 'ఈ బిడ్డ మాకు దేవుడి బహుమానం' పేర్కొన్నారు. తమ కుమారుడు సాధారణ స్థితికి చేరుకుంటాడన్న ధీమా వ్యక్తం చేశారు.

English summary
The baby was born at 4.23am on Saturday to parents Lalitamma and Chennabasava and doctors said it was a normal delivery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X