వైద్య రంగంలో అరుదైన సంఘటన: ఛాతి బయట గుండెతో జన్మించిన పాప
డింటోరీ: వైద్యరంగంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఛాతి బయట గుండెతో ఉన్న బేబీకి జన్మనిచ్చిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని డిండోరీలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
డింటోరీకి చెందిన సుష్మ (22) అనే మహిళ బుధవారం మధ్యాహ్నాం ఛాతి బయట గుండెతో ఉన్న బేబీకు జన్మనిచ్చిందని జబల్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో వైద్యుడు జీకే సమద్ వెల్లడించారు. ఈ విధంగా ఛాతి బయట గుండెతో పుట్టడాన్ని వైద్య పరిభాషలో ‘ఎక్టోపియా కార్డిక్స్' అని అంటారని తెలిపారు.

ఛాతి బయట ఉన్న గుండెతో జన్మించినా మామూలుగానే కొట్టుకుంటుందన్నారు. ఇలాగే కొనసాగితే బేబీ ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపారు. బేబీకి వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని అన్నారు.
ఆపరేషన్‌కు తగిన సౌకర్యాలు తమ ఆసుపత్రిలో లేకపోవడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామని తెలిపారు. ఛాతి బయట గుండెతో జన్మనిచ్చిన పాపను చూసేందుకు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు.












Click it and Unblock the Notifications