వాషింగ్ మెషిన్ లో పసికందును వేశారు
కేరళ: కనికరం లేకుండా పసికందును వాషింగ్ మెషిన్‌లో పడేశారు. వెంటనే విషయం గుర్తించిన స్థానికులు వాషింగ్ మెషిన్ లో ఉన్న పసికందును బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పాప ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు తెలిపారు.
కేరళలోని కోజికోడ్ జిల్లా కోడువ్యాలీ సీఐ ప్రేమ్ జీత్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కోడువ్యాలీలో ఒక మహిళ నివాసం ఉంటున్నది. ఈమె 20 రోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. గురువారం ఆ మహిళ కుమార్తె (పాప)ను వాషింగ్ మెషిన్ లో పడేశారు.

విషయం గుర్తించిన స్థానికులు పాపను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పాపను ఆసుపత్రికి తరలించారు. స్థానిక మీడియా కన్న తల్లే పసికందును వాషింగ్ మెషిన్ లో వేసిందని ఆరోపించింది.
అయితే తాము తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, కేసు పూర్తిగా దర్యాప్తు చేసి నిజనిజాలు తెలుసుకున్న తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని సీఐ ప్రేమ్ జీత్ అంటున్నారు. అందువలనే తల్లి పేరు సైతం తాము బయటకు చెప్పలేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications