ఒక్కసారిగా కంపించిన భూమి.. వరుసగా మూడు రాష్ట్రాల్లో షేక్.

భూగర్భంలో ఏదో జరుగుతోంది! సరిగ్గా ఒక్క రోజు కూడా గడవకముందే ఈశాన్య రాష్ట్రాల్లో భూమి వరుసగా కంపించింది. ఒకదాని తర్వాత ఒకటిగా తగిలిన ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

శనివారం మధ్యాహ్నం అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. మధ్యాహ్నం 2:43 గంటల ప్రాంతంలో భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఒక్కసారిగా ఇళ్లలోని సామాగ్రి కిందపడటంతో జనం ప్రాభణాలతో ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.

Back-to-Back Earthquakes Rock Northeast India as Tremors Jolt Assam and Arunachal Pradesh Safely

అస్సాం ఘటన తాలూకు భయం ఇంకా వీడకముందే, శనివారం రాత్రి 9:28 గంటల సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని కురుంగ్ కుమేయ్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైంది. కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే దీని కేంద్రం ఉన్నట్లు తేలడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. రాత్రి సమయం కావడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి చేరారు.

వణికిపోయిన రష్యా.. ఒక్కసారిగా భారీ భూకంపం.
వణికిపోయిన రష్యా.. ఒక్కసారిగా భారీ భూకంపం.

మేఘాలయలోనూ తప్పని వణుకు..

కేవలం ఈ రెండు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, కొద్ది రోజులుగా ఈశాన్య ప్రాంతంలో భూమి వరుసగా కంపిస్తుండటం అందరినీ కలవరపెడుతోంది. గతంలో మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లాలోనూ ఇలాగే రిక్టరు స్కేలుపై 3.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పట్లో తెల్లవారుజామున భూమి కంపించడంతో జనం నిద్రలోనే ఉలిక్కిపడ్డారు.

ఉలిక్కిపడ్డ ఉత్తరాది! ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు
ఉలిక్కిపడ్డ ఉత్తరాది! ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు

వరుస భూకంపాల వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం గానీ, భారీ ఆస్తినష్టం గానీ జరిగినట్లు అధికారిక సమాచారం రాలేదు. అయితే, ఈ ప్రకంపనలు తీవ్రంగా రావడంతో స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+