వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు బ్యాకప్ ట్రైన్లలో బెర్తులు

హైదరాబాద్: మీరు బుక్ చేసుకొన్న రైలు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉందా? అయితే మీకొ శుభవార్త. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌ను రద్దు చేసుకునే అవకాశం లేకుండా, అదే టికెట్‌పై మరో రైలులో ప్రయాణం చేసే సదుపాయాన్ని భారతీయ రైల్వేలు అందించనున్నాయి.

ఈ విషయంపై రైల్వే బోర్డు అదనపు డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ సక్సేనా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ 'బ్యాకప్ ట్రైన్ల'లో ప్రయాణికులకు బెర్తులిస్తామని చెప్పారు. వెయిటింగ్ లిస్ట్‌లోని ప్రయాణికులకు ఆ తర్వాత బయల్దేరే రైళ్లలో ఖాళీలను బట్టి సీట్లిస్తామని, ఈ ప్రతిపాదనలు ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ప్రయాణికుల సంఖ్యను బట్టి అవసరమైనతే ఆ తర్వాత బయల్దేరే రైళ్లలో అదనపు బోగీలు వేస్తామని తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించే భాగంలో ఇటీవలే ఇండియన్ రైల్వే, ఎయిర్ ఇండియాతో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ స్కీములో దాదాపు 100 టికెట్ల వరకూ అప్‌గ్రేడ్ చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది.

 Back-up trains for wait-listed passengers?

కాగా, జూన్ 21న రైళ్లు రద్దయిన సమాచారాన్ని ప్రయాణికుల ఫోన్లకు నేరుగా ఎస్ఎంఎస్ సేవలను రైల్వే శాఖ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పైలట్‌ ప్రాజెక్టుగా రైలు ప్రారంభ స్టేషన్‌లో టికెట్లు రిజర్వ్‌ చేసుకున్న వారికి ఈ సేవలు అందిస్తామని, తర్వాతి దశలో రద్దయిన రైలుకు సంబంధించి ఎన్ని స్టేషన్లలో ఎంతమంది ప్రయాణికులు రిజర్వ్‌ చేసుకున్నారో వారందరికీ పంపుతామని పేర్కొంది.

ఆన్‌లైన్‌, నేరుగా రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులు ఇచ్చే మొబైల్‌ నంబర్‌కు ఈ ఎస్ఎంఎస్‌లు వెళ్తాయని, తప్పనిసరి పరిస్థితుల్లో రైలును రద్దు చేసినప్పుడు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ ఎస్ఎంఎస్‌లు ఉపయోగపడతాయని వివరించింది. కేంద్ర రైల్వే సమాచార వ్యవస్థ, రైల్వే శాస్త్ర సాంకేతిక విభాగం ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+