Chandrayaan 3, ప్రకాష్ రాజ్ పైత్యం దిగిపోయింది, హద్దుపొద్దు లేకుండా !
బెంగళూరు/బాగల్ కోటే: ప్రపంచ దేశాల కళ్లు మొత్తం భారత్ మీద పడ్డాయి. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండింగ్ కోసం దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రయాన్-3 గురించి హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ మీద కేసు నమోదు అయ్యింది.
నటుడు ప్రకాష్ రాజ్‌పై హిందూ సంఘాల నేతలు కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయని పోలీసులు తెలిపారు. ఇందుకు కారణమైన ఓ ఫోటోను నటుడు ప్రకాష్ రాజ్ ఆదివారం ట్విట్టర్‌లో షేర్ చేశారు.

చొక్కా, లుంగీ ధరించిన వ్యక్తి పై నుండి కిందికి టీ కలుపుతున్నట్లు చిత్రీకరించబడింది. ఇది ప్రసిద్ధ కార్టూన్. దీన్ని షేర్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్ బ్రేకింగ్ న్యూస్, చంద్రయాన్ -3 నుంచి విక్రమ్ ల్యాండర్ పంపిన మొదటి ఫోటో, వావ్ అని రాశాడు. అలాగే నటుడు ప్రకాష్ రాజ్ అతని పైత్యంతో జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్‌ని యధావిధిగా ఉపయోగించారు. దీనిపై నెటిజన్లు నటుడు ప్రకాష్ రాజ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ మీద మండిపడ్డారు.
చాలా మంది నెటిజన్లు చంద్రయాన్-3 మిషన్ ఒక పార్టీ కాదని, ఇది దేశం గర్వించదగ్గదని వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ తీరును తీవ్రస్థాయిలో ఖండించారు. దీని తర్వాత ప్రకాష్ రాజ్ ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది అని ట్వీట్ చేస్తూ ఎదురు దాడికి దిగారు. ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది అంటూ ప్రకాష్ రాజ్ ఎదురుదాడికి దిగడంతో నెటిజన్లు ఆయన మీద మండిపడ్డారు.

భారత శాస్త్రవేత్తల కష్టానికి ఫలితంగా చంద్రయాన్-3 విజయవంతం కావాలని దేశంలోని మొత్తం ప్రజలు ప్రార్థనలు చేస్తుంటే పనిపాట లేనినటుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్నాడని, ఇక్కడ కూడా పార్టీ రంగు పులమాలని అతను ప్రయత్నిస్తున్నాడని బాగల్ కోటేకు చెందిన హిందూ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications