CNG Bike: త్వరలో మార్కెట్ లోకి సీఎన్జీ బైక్.. ఏ కంపెనీ నుంచి అంటే..!
పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలా మంది వాహనాలు కొనాలంటే భయపడుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ కు ప్రత్యమ్నాయంగా సీఎన్జీ, ఈవీ వెహికిల్స్ వచ్చాయి. అయితే ఈవీ వాహనాలకు ధరలు కాస్త ఎక్కువ ఉండడంతో చాలా మంది సీఎన్జీ వైపు మొగ్గు చూతున్నారు. సీఎన్జీ త్రీవీలర్, ఫోర్ వీలర్లలో అందుబాటులో ఉంది. కానీ టూ వీలర్లలో సీఎన్జీ వాహనాలు అందుబాటులో లేవు. టూ వీలర్లలో పెట్రోల్, ఈవీ తప్ప మిగతా ఏ వేరైటీ అందుబాటులో లేదు.
తాజాగా బజాజ్ ఆటో సీఎన్జీ టూ వీలర్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ కూడా మాట్లాడారు.
సీఎన్‌జీ నెట్‌వర్క్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. సీఎన్జీ బైక్ తీసుకొస్తున్నట్లు వివరించారు. ఈ సీఎన్జీ బైక్ లు ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కమ్యూటర్ స్టాను కూడా 110-125 సీసీ మధ్య వచ్చే అవకాశం ఉంది. మైలేజ్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే సీఎన్‌జీ బైక్ లాంచ్ చేయనుంది.

ఈ బైక్‌ను వేరే బ్రాండ్‌తో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్ సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందని చెబుతున్నారు. సంవత్సరం జూన్ లో మొదటి బజాజ్ సీఎన్‌జీ టూ వీలర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బజాజ్ వచ్చే ఐదేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పట్ల బజాజ్ గ్రూప్ 35,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎండి రాజీవ్ బజాజ్ తెలిపారు.
బజాజ్ లో సక్సెస్ అయన వెహికిల్ పల్సర్.ఈ పల్సర్ బైస్ ల విక్రయాలు త్వరలో రెండు మిలియన్ల చేరుతాయని కంపెనీ భావిస్తోంది. బజాజ్ పల్సర్ ను 2001 లో తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక మార్పులతో పల్సర్ బైక్ లు వచ్చాయి. బజాజ్ కంపెనీ త్వరలో 400 సీసీ ఇంజిన్ తో పల్సర్ బైక్ ను రిలీజ్ చేయనుంది. సీఎన్జీ బైక్ లు మార్కెట్ లోకి వస్తే డిమాండ్ భారీగా ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications