జైబాలయ్య, జైజై బాలయ్య, బెంగళూరులో భగవంత్ కేసరి హంగామా, బాలయ్య, శ్రీలీల కౌటౌట్స్!
హైదరాబాద్/బెంగళూరు: జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రయోగాలు చెయ్యడంలో సిద్దంగా ఉంటారని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు (nandamuri balakrishna) పేరు ఉంది. బాలకృష్ణ సినిమా అంటే ఆయన అభిమానులకు పండగే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దసరా పండుగ బాలయ్య (balakrishna) అభిమానులకు ముందుగానే వచ్చేసింది. జైబాలయ్య అంటూ ఆయన అభిమానులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు.
నందమూరి బాలకృష్ణ (balakrishna)నటించిన భగవంత్ కేసరి (bhagwant kesari) సినిమా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుతో పాటు విదేశాల్లో, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భగవత్ కేసరి (bhagwant kesari) విడుదల అయ్యింది. కామెడీని యాక్షన్ తో మిక్స్ చేసి సినిమాలు తియ్యడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకు సినీ అభిమానులు క్యూకడుతున్నారు.

బాలయ్య (balakrishna)మార్క్ మాస్ మసాలతో, అనిల్ రావిపూడి స్టైల్లో భగవంత్ కేసరి సినిమా నందమూరి అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే బాలయ్య అభిమానులు భగవంత్ కేసరి (bhagwant kesari)సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో బాలయ్య అభిమానులు భగవంత్ కేసరి (bhagwant kesari)సినిమా విడుదల అయిన థియేటర్ల ముందు సందడి చేస్తున్నారు.

బెంగళూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా భగవంత్ కేసరి (bhagwant kesari)సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యింది. బెంగళూరులోని (Bengaluru) అన్ని ప్రాంతాల్లోని థియేటర్లలో భగవంత్ కేసరి సినిమాను విడుదల చేశారు. బెంగళూరు నగరంలోని హలసూరుకు చెందిన యంగ్ స్టార్ NBK అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మెజస్టిక్ లో భగవంత్ కేసరి (bhagwant kesari)సినిమా విడుదల అయిన థియేటర్ ముందు పండుగ చేసుకున్నారు.


నందమూరి బాలకృష్ణతో (balakrishna)పాటు శ్రీలీల కటౌట్ లకు భారీగా గజమాలలు, పూలమాలు వేశారు. బెంగళూరు (Bengaluru) నగరంలోని చాలా ప్రాంతాల్లో భగవంత్ కేసరి (bhagwant kesari) సినిమా విడుదల అయిన థియేటర్లు హౌస్ ఫుల్ కావడంతో బాలయ్య అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. హలసూరుకు చెందిన యంగ్ స్టార్ ఎన్ బీకే (balakrishna) అభిమానుల సంఘం నాయకులు బాలకృష్ణ, గంగాధర్, చలపతి, అనిల్, భాస్కర్, మునికృష్ణ తదితరులు బాలయ్య (balakrishna) ఫోటోలతో సినిమా థియేటర్లు నిండిపోయేలా భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications