యూజర్లకు గుడ్‌న్యూస్ : టిక్ టాక్ యాప్ బ్యాన్ ఎత్తివేత
చెన్నై : చైనాకు చెందిన యాప్ టిక్ టాక్‌పై నిషేధం ఎత్తివేస్తూ మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఆశ్లీల దృశ్యాలు అప్ లోడ్ చేయొద్దని షరతు విధించింది. టిక్ టాక్ యాప్‌తో ఆశ్లీలత ఎక్కువవుతోందని మద్రాస్ కు చెందిన అడ్వకేట్ ముత్తుకుమార్ మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా కొత్త యాప్ డౌన్ లోడ్ చేయడంపై కోర్టు నిషేధం విధిందింది. అయితే దీనిపై కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు ఎత్తివేసింది.
ఆ పూచీ మాదీ : బైట్ డ్యాన్స్ కంపెనీ
దేశ భద్రత, అశ్లీల వీడియోలు యాప్ లోకి అప్ లోడ్ కాకుండా చర్యలు తీసుకుంటామని బైట్ డ్యాన్స్ మద్రాస్ హైకోర్టుకు వివరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేయమని, 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించుకుండా చర్యలు చేపడుతామని హామీనివ్వడంతో మద్రాస్ హైకోర్టు ఇదివరకు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఎంచక్కా డౌన్ లోడ్ చేయొచ్చు ..
ఏప్రిల్ 3 మద్రాస్ హైకోర్టుకు పిటిషన్ రావడంతో కొత్త యూజర్లు యాపిల్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధం విధించింది. తాజాగా షరతులతో కూడిన నిషేధం ఎత్తివేయడంతో .. కొత్త యూజర్లు కూడా టిక్ టాక్ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.












Click it and Unblock the Notifications