9వ తేది కర్ణాటక బంద్: టీఎన్ కనపడితే అంతే
బెంగళూరు: కావేరీ నీరు తమిళనాడుకు విడుదల చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 9వ తేది శుక్రవారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. కర్ణాటక బంద్ కు 1,200 కన్నడ సంఘ, సంస్థలు మద్దతు ఇచ్చాయి.
కన్నడ చళవలి వాటాళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటాళ్ నాగరాజ్ అధ్యక్షతన పలు కన్నడ సంఘ, సంస్థల నాయకులు చర్చించారు. సెప్టెంబర్ 9వ తేదిన కర్ణాటక బంద్ విజయవంతం చెయ్యాలని తీర్మానించారు.
తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని వారు చెప్పారు. కర్ణాటక బంద్ కు మొత్తం 1,200 కన్నడ సంఘాలు మద్దతు ఇస్తున్నాయని వాటాళ్ నాగరాజ్ అన్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమ, కర్ణాటక లారీ యజమానుల సంఘం, కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ, లారీ, ఆటో, ట్యాక్సీ తదితర సంఘాల నాయకులు మద్దతు ఇస్తున్నారని వాటాళ్ నాగరాజ్ తెలిపారు.
బంద్ రోజు ఎక్కడా హొటల్స్, సినిమా హాల్స్ తీయ్యరని అన్నారు. కావేరీ నీరు తమిళనాడుకు వదిలి పెట్టరాదని డిమాండ్ చేస్తూ తాము పోరాటం చేసి జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని, కర్ణాటక మొత్తం మాకు మద్దతు ఇస్తున్నదని కన్నడ సంఘాల నాయకులు చెప్పారు.
తమిళనాడు వాహనాలు ధ్వంసం
కావేరి నీరు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ బుధవారం మండ్య జిల్లాలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. తమిళనాడుకు చెందిన హబీబ్ ఆయిల్ కంపెనీకి చెందిన ఆరు లారీల మీద ఆందోళనకారులు రాళ్ల వర్షం కురింపించారు..
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏ వాహనం వదిలిపెట్టలేదు. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో పలువురికి తీవ్రగాయాలైనాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులతో కొట్టిస్తున్నారని పలు సంఘాలు మండిపడ్డాయి.












Click it and Unblock the Notifications