ఒంటరిగా వాకింగ్ కు వెళితే.. 40 మంది మహిళలను.. వాడేం చేశాడో తెలుసా?

ఉదయం... సాయంత్రం వేళ ఒంటరిగా వాకింగ్ చేసే మహిళలను లక్ష్యంగా చేసుకొని ఓ కామాంధుడు నెలరోజుల్లో 40 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. ఇద్దరు మహిళల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఈ కామాంధుడి ఆట కట్టించ

ముంబయి : ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించిన కామాంధుడి బాగోతాన్ని ముంబయి పోలీసులు బట్టబయలు చేశారు. ఉదయం... సాయంత్రం వేళ ఒంటరిగా వాకింగ్ చేసే మహిళలను లక్ష్యంగా చేసుకొని నెలరోజుల్లో 20 మంది మహిళలను లైంగికంగా వేధించాడని దర్యాప్తులో తేలడంతో పోలీసులే నివ్వెరపోయారు.

తూర్పు బాంద్రాలోని నవపద ప్రాంతానికి చెందిన జిబ్రాన్ షఫీ సయ్యద్ (28) అనే వ్యక్తి దుస్తులు విక్రయిస్తుంటాడు. ముంబయి నగరంలోని పాలీహిల్ నర్గీస్‌దత్ రోడ్డుపై ఉదయాన్నే వాకింగ్ చేస్తుండగా హోండా యాక్టివా స్కూటరుపై వచ్చిన ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని 21 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Bandra Pervert, with 40 Cases of Grabbing Women, finally Held

రిజ్వీ కళాశాల కార్టర్ రోడ్డుపై తాను సాయంత్రం వేళ వాకింగ్ చేస్తుండగా హోండా యాక్టివాపై వచ్చిన ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని మరో మహిళ ఫిర్యాదు చేసింది. ఇలా మహిళల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి నంబరు లేని హోండా యాక్టివాను గుర్తించారు.

యాక్టివా రంగుతో వాహనం వివరాలు, చిరునామాలు తెలుసుకొని పోలీసులు పరిశీలించగా తూర్పు బాంద్రాలోని నవపదకు చెందిన జిబ్రాన్ షఫీ సయ్యద్ వాకింగ్ చేస్తున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని లైంగికంగా వేధిస్తున్నాడని తేలింది. ఉదయం, సాయంత్రం నడక కోసం ఒంటరిగా వచ్చిన 40 మంది దాకా మహిళలను తాను లైంగికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో జిబ్రాన్ సఫి అంగీకరించాడు.

అయితే వేధింపులకు గురైన 40 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. నిందితుడు జిబ్రాన్ షఫీ సయ్యద్ 2011లో ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జైలు నుంచి వచ్చాక కూడా మహిళలపై లైంగిక వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడని తేలడంతో అతనిపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+