వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేతనాల్లో బెంగుళూరు టాప్, ఫార్మా, హెల్త్‌కేర్‌ల్లో ఎక్కువ వేతనాలు: రిపోర్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ రంగంలో టాప్‌గా ఉన్న బెంగుళూరు అత్యధిక వార్షిక వేతనాలను ఆఫర్ చేయడంలో కూడ టాప్‌లోనే నిలిచింది. అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు సగటున రూ.10.8 లక్షల వార్షిక వేతనాన్ని చెల్లిస్తున్నట్టుగా రాండ్‌స్టాడ్‌ ఇన్‌సైట్‌ వేతన ధోరణులు-2018 రిపోర్ట్ వెల్లడించింది.

భారత ఐటీ క్యాపిటల్‌గా బెంగుళూరు ఇండియాలో పేరొందింది. ఇండియా సిలికాన్ వ్యాలీగా బెంగుళూరును పిలుస్తారు. ప్రముఖ టెక్ సంస్థలు బెంగుళూరు నగరంలో ఉన్నాయి.అంతేకాదు అత్యధిక వేతనాలు ఇవ్వడంలో కూడ బెంగుళూరు టాప్‌లోనే ఉంది.

అత్యధిక వేతనాలు బెంగుళూరులోనే

అత్యధిక వేతనాలు బెంగుళూరులోనే

దేశంలో పలు రకాల ఉద్యోగులకు అత్యధిక వార్షిక వేతనాలు ఇవ్వడంలో బెంగుళూరు టాప్‌లో నిలిచింది. అన్ని రంగాల్లోని వివిధ స్థాయిల్లోని ఉద్యోగులకు సగటున రూ. 10.8 లక్షల వార్షిక వేతనాలను చెల్లిస్తూ ముందు వరుసలో బెంగుళూరు ఉంది. దేశంలోనే అన్ని రకాలైన ఉద్యోగుల్లో వేతనాల చెల్లింపులో బెంగుళూర్ టాప్‌లో ఉందని ఓ నివేదిక వెల్లడించింది.

హైద్రాబాద్ స్థానమిదే

హైద్రాబాద్ స్థానమిదే

ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో బెంగుళూరు టాప్‌లో నిలిస్తే, ఆ తర్వాత స్థానంలో పూణె నిలిచింది. పూణెలో ఏటా రూ.10.3 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తున్నారు. ముంబై, న్యూఢిల్లీలో ఏటా రూ.9.9 లక్షలు చెల్లిస్తున్నారు. చెన్నెలో ఏటా రూ.8 లక్షలు చెల్లిస్తున్నారు. హైద్రాబాద్‌లో ప్రోఫెషనల్స్‌కు రూ.7.9 లక్షలు చెల్లిస్తున్నారు. కోల్‌కతాలో సగటున వృత్తి నిపుణులకు ఏటా రూ.7.2 లక్షలు చెల్లిస్తున్నారు.

ఫార్మా, హెల్త్‌కేర్‌లలో వేతనాలు

ఫార్మా, హెల్త్‌కేర్‌లలో వేతనాలు

ఫార్మా, హెల్త్‌కేర్‌లలో ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని సర్వే రిపోర్టు చెబుతోంది. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో నిపుణులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నారు. దాదాపు 20 పరిశ్రమల్లోని విభాగాలు, 15 క్యాటగిరీలకు చెందిన లక్ష ఉద్యోగాలను విశ్లేషించి రూపొందించిన రాండ్‌స్టాడ్‌ ఇన్‌సైట్‌ వేతన ధోరణులు-2018 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.ఫార్మా, హెల్త్‌కేర్‌ పరిశ్రమకు చెందిన ప్రొఫెషనల్స్‌ అత్యధిక వేతనాలు పొందుతున్నట్టు తెలిపింది.

జీఎస్టీతో ఆడిటింగ్ నిపుణులకు ఆదాయం

జీఎస్టీతో ఆడిటింగ్ నిపుణులకు ఆదాయం

జీఎస్టీని కేంద్రం అమలు చేయడంతో సీఏలు, ఆడిటింగ్‌ నిపుణులకూ రూ 9.4 లక్షల వార్షిక వేతనం సగటున లభిస్తోంది.. వైద్యం తర్వాత మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌, అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ నిపుణులు తర్వాతి స్ధానంలో నిలుస్తుండగా, ఐటీ రంగ నిపుణులకు సగటున రూ 9.1 లక్షల వార్షిక వేతనం దక్కుతోంది.

English summary
Bangalore, India's IT capital, is the highest paying city in the country with an average annual CTC for talent across all levels and functions standing at Rs 10.8 lakh, while pharma and healthcare is the highest paying industry for talent in India, a report has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X