ఉరివేసుకుని ఎంటెక్ విద్యార్థి సూసైడ్, వీడియో చిత్రీకరణ

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. షిమోగా ప్రాంతానికి చెందిన మృతుడు హరీశ్ వీరభద్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పిఈఎస్ఐటిలో చదువుకుంటున్న హరీశ్, తన స్నేహితుడు చేతన్ గదిలో పేయింగ్ గెస్టుగా ఉంటున్నాడు. ఎంటెక్ మొదటి, రెండు సంవత్సరాల్లో పలు సబ్జెక్టుల్లో ఫేయిలైన హరీశ్, తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హరీశ్ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తన మొబైల్ ఫోన్‌ను కిటికీలో పెట్టి వీడియో కెమెరాను ఆన్ చేశాడు. ఆ తర్వాత ఓ బకెట్ మీద నిల్చుని ఇంటి పైకప్పుకు తాడు బిగించుకుని ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా చేతన్ తన గదికి చేరుకున్న తర్వాత ఈ ఘటన రాత్రి 9.45 ప్రాంతంలో వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెప్పారు.
ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో బాత్ రూం గదిలో నుంచి చూడగా హరీశ్ ఉరివేసుకుని చేతన్‌కు కనిపించాడు. తీవ్ర ఆందోళనకు గురైన చేతన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హరీశ్ మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి, అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వీడియోను పరిశీలించారు. అయితే బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడంతో హరీశ్ ఉరివేసుకునే వరకే అందులో రికార్డు చేయబడింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో హరీశ్ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications