‘ఈ రాత్రికి మాతో గడుపుదువుగాని రా..’, వర్థమాన సినీనటిని అటకాయించి...

కన్నడ వర్ధమాన సినీ నటి (23) పై ఇద్దరు యువకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘ఈ రాత్రికి మాతో గడుపుదువుగాని రా...’ అని అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఇద్దరూ చెరో చేతిని పట్టుకుని ఆమెను లాక్కుని పోయే ప్రయత్నం చే

బెంగళూరు: ఓ కన్నడ వర్ధమాన సినీ నటి (23) పై ఇద్దరు యువకులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరు రాజగోపాలనగర ఠాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సినిమా షూటింగ్ లో పాల్గొని హెగ్గనహళ్లి వద్ద క్యాబ్‌ దిగి ఇంటికి వెళ్తున్న సదరు సినీ నటిని సచిన్‌, ప్రవీణ్‌ అలియాస్‌ పుట్ట అడ్డగించారు. 'ఈ రాత్రికి మాతో గడుపుదువుగాని రా...' అని అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఇద్దరూ చెరో చేతిని పట్టుకుని ఆమెను లాక్కుని పోయే ప్రయత్నం చేశారు.

Bangalore: Molestation on Kannada Upcoming Actress

ఆ నటి తీవ్రంగా ప్రతిఘటించడంతో చివరికి ఆమెను దూషిస్తూ, దాడి చేసి పరారయ్యారు. ఆ ఇద్దరితో తనకు మూడేళ్లుగా పరిచయం ఉందని, వారి వేధింపులతో గతంలో తాను ఆత్మహత్యా యత్నం కూడా చేశానని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దర్నీ తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే వారేమో.. సదరు నటి తమకు నగదు బాకీ ఉందని, తాము అడగడంతో తమపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు. ఈ ఘటనలో నిజానిజాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+