దేశంలోనే మొదటిది: బెంగళూరు రైల్వే స్టేషన్‌కు వైఫై
బెంగళూరు: దేశంలోనే తొలి వైఫై సౌకర్యం కలిగిన రైల్వేస్టేషన్‌గా బెంగళూరు సిటీ స్టేషన్ రికార్డులకెక్కనుంది. ఇటీవలే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ వైఫై సేవలను ప్రారంభించారు. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు తొలి 30 నిమిషాల పాటు ఉచితంగానే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. ఆ తర్వాత వినియోగించే ఇంటర్నెట్‌కు ప్రయాణికులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయాణీకులు తొలుత ముప్పై నిమిషాల పాటు ఉచితంగా మొబైల్ ఫోన్ల పైన వైఫై సేవలు వినియోగించుకున్న తర్వాత.. సమయాన్ని బట్టి ఛార్జీ ఉంటుంది. ఉచిత సమయం తర్వాత వైఫై పొందాలంటే స్టేషన్లోని వైఫై హెల్ప్ డెస్క్ నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
30 నిమిషాల కార్డు ధర రూ.25 గానూ, 60 నిమిషాల కార్డు ధర రూ.35 గానూ నిర్ణయించారు. ఈ కార్డులు ఒకసారి కొన్న తర్వాత 24 గంటల్లోగా వినియోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవి చెల్లవని, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కూడా ఈ వైఫై కార్డులు కొనుగోలు చేయవచ్చని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
ప్రాణభయంతో సిగరెట్ మానేశా: సిద్ధరామయ్య
ప్రాణభయంతో సిగరెట్ మానేసి ఓ మంచి పని చేశానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. బెంగళూరు మంగళవారం ఆయన పొగాకు ఉత్పత్తులవల్ల వచ్చే రోగాల నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై నివేదికను విడుదల చేశారు.

ప్రారంభించిన సదానంద
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఇటీవల బెంగళూరు నగర రైల్వే స్టేషన్ వైఫై సేవలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పలకం దృశ్యం.

బెంగళూరు రైల్వే స్టేషన్లో వైఫై
ఈ నేపథ్శంయంలో దేశంలోనే తొలి వైఫై సౌకర్యం కలిగిన రైల్వేస్టేషన్‌గా కర్నాటక రాజధాని బెంగళూరు సిటీ స్టేషన్ రికార్డులకెక్కనుంది. స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు తొలి 30 నిమిషాల పాటు ఉచితంగానే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి.

రైల్వే స్టేషన్లో వైఫై
కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలోని రైల్వే స్టేషన్లో వైఫై సదుపాయాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం.

రైల్వే స్టేషన్లో వైఫై
ప్రయాణీకులు తొలుత ముప్పై నిమిషాల పాటు ఉచితంగా మొబైల్ ఫోన్ల పైన వైఫై సేవలు వినియోగించుకున్న తర్వాత.. సమయాన్ని బట్టి ఛార్జీ ఉంటుంది. ఉచిత సమయం తర్వాత వైఫై పొందాలంటే స్టేషన్లోని వైఫై హెల్ప్ డెస్క్ నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాను యువకుడిగా ఉన్న సమయంలో బీడీ తాగేవాడినని ఈ సందర్భంగా సిద్ధరామయ్య తెలిపారు. ఆ పైన సిగరెట్‌కు కూడా అలవాటుపడ్డానని ఆయన గుర్తు చేసుకున్నారు. చివరకు 1987 ఆగస్టు 17న సిగరెట్‌కు గుడ్‌బై చెప్పేశానని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications