ప్రాణం పోతున్నా, సజీవంగా ఉన్న గుండె రవాణా
బెంగళూరు: కన్న బిడ్డ ప్రాణాలు పోతున్నాయని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతని అవయవాలు వేరే వారికి దానం చేయ్యడానికి ముందుకు వచ్చారు. పొట్టకూటి కోసం బెంగళూరు వచ్చిన బిడ్డను పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
గురువారం బెంగళూరు నగరంలో సజీవంగా ఉన్న గుండెను మరొ చోట ఉన్న ఆసుపత్రికి తరలించి మరొ ప్రాణాన్ని కాపాడారు. గురువారం ఉదయం 8.30 గంటలకు బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులోని సాగర్ ఆసుపత్రి నుండి చేతన్ (22) అనే యువకుడి గుండెను సజీవంగా బయటకు తీశారు.

తరువాత ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ కారిడాన్ ఏర్పాటు చేశారు. సాగర్ ఆసుపత్రి నుండి ప్రత్యేక ఆంబులెన్స్ లో బెంగళూరు-హోసూరు రోడ్డులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి 20 నిమిషాల వ్యవదిలో తరలించారు. మండ్యకు చెందిన చేతన్ (22) బ్రతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చాడు.
నగర శివార్లలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఈనెల 15వ తేదిన ఫ్యాక్టరీలోని యంత్రంలో చిక్కుకుని తీవ్రగాయాలైనాయి. సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చేతన్ బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని అవయవాలు దానం చెయ్యడానికి చేతన్ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications