వర్క్ ఫ్రమ్ కారు.. మహిళా ఉద్యోగి నిర్వాకం.. పోలీసులు ఏం చేశారంటే?
వర్క్- లైఫ్ బ్యాలెన్స్ చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇస్తున్నాయి. కొవిడ్-19 వర్క్ ఫ్రమ్ హోం విధానం ఎక్కువైంది. ఈ క్రమంలో బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ కారు డ్రైవింగ్ చేస్తూ మరో పక్క లాప్ టాప్ లో వర్క్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP) ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోలో ఓ మహిళ ఓ పక్క కారు డ్రైవింగ్ చేస్తూనే మరో పక్క ఒళ్లో లాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోను పబ్లిక్ వీడియో తీసి బెంగళూరు డీసీపీ కి షేర్ చేశారు. ఆ వీడియోను బెంగళూరు డీసీపీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోం .. కానీ వర్క్ ఫ్రమ్ కారు కాదు.. అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షా20వేలమంది వీక్షించారు. 2వేల మంది లైక్ చేశారు.

ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ సీరియస్ అయింది. నిర్లక్యంగా కారు నడిపిన ఆ ఉద్యోగికి జరిమానా విధించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని ఆమెపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. ఆమె ఫేస్ ను ఎందుకు బ్లర్ చేశారని మరో వ్యక్తి కామెంట్ చేశారు. మరో వ్యక్తి ట్వీట్ చేస్తూ.. ఇది ఉద్యోగి తప్పా? లేక ఆఫీసర్ తప్పా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
"work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R
— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025












Click it and Unblock the Notifications