వాజపేయికి బంగ్లా ‘లిబరేషన్ వార్ ఆనర్’: అందుకున్న మోడీ(ఫోటోలు)

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘లిబరేషన్ వార్ ఆనర్‌'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వాజపేయి తరుపున ఈ అవార్డుని ఆదివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రధాని నరేంద్రమోడీ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ వాజ్‌పేయ్ తరపున ఈ లిబరేషన్ వార్ ఆనర్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ పురస్కారాన్ని వాజపేయికి ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. వాజపేయి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అటల్ జీ ఆరోగ్యం బాగుంటే ఆయనే వచ్చి ఈ పురస్కారం తీసుకునే వారని తెలిపారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వాజ్‌పేయ్ ఎనలేని కషి చేశారని అన్నారు.

1971లో భారతీయ జన సంఘ్ అధ్యక్షుడిగా, ఎంపీగా విమోచన (లిబరేషన్) యుద్ధ సమయంలో బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యోద్యమానికి సంపూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బంగ్లాదేశ్‌కు మద్దుతుగా నిలిచారని అందుకు గుర్తుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రకటించిన ఈ పురస్కారాన్ని ఆమె తరుపున 2012లో సోనియాగాంధీ స్వీకరించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ అవార్డుని అందుకున్నారు.

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ‘లిబరేషన్ వార్ ఆనర్‌'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వాజపేయి తరుపున ఈ అవార్డుని ఆదివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రధాని నరేంద్రమోడీ అందుకున్నారు.

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ వాజ్‌పేయ్ తరపున ఈ లిబరేషన్ వార్ ఆనర్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని వాజపేయికి ప్రకటించిన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

వాజపేయి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అటల్ జీ ఆరోగ్యం బాగుంటే ఆయనే వచ్చి ఈ పురస్కారం తీసుకునే వారని తెలిపారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వాజ్‌పేయ్ ఎనలేని కషి చేశారని శ్లాఘించారు.

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ రాష్ట్రపతి మహ్మాద్ అబ్దుల్ హమీద్‌తో మాట్లాడుతున్న దృశ్యం.

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

వాజ్‌పేయ్‌కి బంగ్లాదేశ్ ‘లిబరేషన్ వార్ ఆనర్': అందుకున్న మోడీ

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ రాజధాని ఢాకాలోని రామకృష్ణ మిషన్‌ను సందర్శించారు. రామకృష్ణ మిషన్ సభ్యులు ప్రధాని మోడీకి మొమెంటో అందజేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+