శాంతినికేతన్ బంగ్లాదేశీ విద్యార్థినిపై రేప్: గార్జియన్ పనే
శాంతినికేతన్: శాంతినికేతన్‌లో చదువుతున్న బంగ్లాదేశీ విద్యార్థినిపై స్థానిక సంరక్షకుడు అత్యాచారం చేశాడు. అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిపై అత్యాచారం చేసిన వ్యక్తి కూడా బంగ్లాదేశ్‌కు చెందినవాడేనని భిర్బూమ్ పోలీసు సూపరింటిండెంట్ అలోక్ రాజోరియా చెప్పారు
అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫొటోగ్రాఫ్‌లను తీసుకుని అతను తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. అమ్మాయి శుక్రవారం బోల్పూర్ పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు వ్యక్తిని గత రాత్రి అరెస్టు చేసారు.

అమ్మాయి శాంతినికేతన్‌లో ఉంటూ చదువుకుంటోంది. కాగా, ఆ వ్యక్తి శాంతినికేతన్ బయట ఉంటున్నాడు. అమ్మాయి ఆస్పత్రిలో ఉందని ఎస్పీ చెప్పారు. సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న విషయం తెలిసిందే. దేశవిదేశాల నుంచి విద్యనభ్యసించడానికి ఇక్కడికి విద్యార్థులు వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఖ్యాతి గడించింది.












Click it and Unblock the Notifications