రేపు ,ఎల్లుండి బ్యాంకులు బంద్.. ఎందుకంటే..?
పండుగల సీజన్‌గా పేరుపొందిన అక్టోబర్ నెలలో, బ్యాంకుల సెలవుల గురించి వినియోగదారులు నిత్యం ఆరా తీస్తూనే ఉంటారు. అయితే, దేశవ్యాప్తంగా కాకుండా, ఆయా రాష్ట్రాల పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలను బట్టి ఈ సెలవులు మారుతూ ఉంటాయి. మీకు ముఖ్యమైన బ్యాంక్ పని ఉంటే, మీ ప్రాంతంలో సెలవు ఉందో లేదో తెలుసుకోవడం తప్పనిసరి. ఈ సోమవారం , మంగళవారం (అక్టోబర్ 27, అక్టోబర్ 28) దేశంలోని కొన్ని ముఖ్య ప్రాంతాలలో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
అక్టోబర్ 27, సోమవారం, అక్టోబర్ 28, మంగళవారం ఈ రెండు రోజులలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, బీహార్ రాజధాని పాట్నా, జార్ఖండ్ రాజధాని రాంచీలలో బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతాలలో అత్యంత పవిత్రంగా జరుపుకునే 'ఛఠ్ పూజ' పండుగ. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, స్థానిక పండుగలను అనుసరించి ఈ సెలవులను ప్రకటించారు.

బ్యాంక్ బంద్ అయినా.. మీ లావాదేవీలు ఆగవు
బ్యాంకులకు సెలవు ఉన్నప్పుడు నగదు లావాదేవీలు ఆగిపోతాయేమో అని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధునిక బ్యాంకింగ్ టెక్నాలజీ ద్వారా మీరు మీ ఆర్థిక లావాదేవీలను నిరంతరాయంగా కొనసాగించవచ్చు.ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నా, బిల్లు పేమెంట్స్ చేయాలనుకున్నా... నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వంటి సేవలు నిత్యం 24x7 పనిచేస్తూనే ఉంటాయి.
నగదు విత్‌డ్రా చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి, బ్యాంకులకు సెలవు ఉన్నా, ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల కోసం వేచి చూడాల్సిన పనిలేదు. డిజిటల్ సేవలను వినియోగించుకుని మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలరు. ఈ ప్రాంతాలలో నివసించే వారు మాత్రం, ముఖ్యమైన పనుల కోసం బ్యాంకుకు వెళ్లాలనుకుంటే, ఈ సెలవులను దృష్టిలో ఉంచుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications