Holidays: ఫిబ్రవరిలో 11 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..!
ఫిబ్రవరి నెలలో అడుగు పెట్టబోతున్నాం. ఈ ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండనున్నాయి. చలికాలానికి ప్రజలు వీడ్కోలు పలికి వేసవి కాలానికి స్వాగతం పలికే నెలగా ఫిబ్రవరి ఉండబోతోంది. ఈ నెలలో పెద్ద పండుగలు ఏమీ లేకపోయినప్పటికీ.. 11 రోజులు బ్యాంకులకు పని చేయవు. 18 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. 11 రోజుల సెలవుల్లో సాధారణ సెలవులు, నేషనల్ హాలీడేస్ ఉన్నాయి.
ఫిబ్రవరి 4న ఆదివారం కావడంతో బ్యాంకులతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 10న రెండో శనివారం రానుంది. ఆ రోజు కూడా బ్యాంకులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల మూసి ఉంటాయి. ఫిబ్రవరి 11న ఆదివారం సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 14న వసంత పంచమి ఉంది. పంచమి సందర్భంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర, ఒడిశాలో సెలవు ఉండనుంది.

ఫిబ్రవరి15న నగై ని నది సందర్భంగా మణిపూర్ లో సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 18న ఆదివారం కావడంతో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉంది. ఈ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ రోజు కూడా మహారాష్ట్రలో బ్యాంకులు పని చేయవు. ఫిబ్రవరి 20న మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఆవతరణ దినోత్సవం సందర్భంగా సెలవు ఉండనుంది.
ఫిబ్రవరి 24 రెండో శనివారం రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఫిబ్రవరి 25న ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. ఈ సెలవు రోజుల్లో బ్యాంకులు పని చేయవు. కానీ డిజిటల్ సర్వీసులు మాత్రం కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications