బ్యాంకులకు వరుస సెలవులు

Bank holidays in August 2025: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి.

తమ నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ తప్ప మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. ఫలితంగా ప్రజల దైనందిన జీవితంలో అవి కీలక పాత్ర పోషిస్తోన్నాయి. అలాంటి బ్యాంకులు ఒక్క రోజు మూత పడినా వందల కోట్ల రూపాయల మేర కార్యకలాపాలు స్తంభించిపోతుంటాయి.

Bank Holidays In August 2025

ఆగస్టు నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు రోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్ట్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్.

ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద.. డిసెంబర్ నెల మొత్తంగా ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు. ఇవి పోను- ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో.. అక్కడి ప్రజల సంప్రదాయాలు, పండుగలు, తిథులను అనుసరించి జారీ చేసే సెలవులు అదనం.

రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులకు యధాతథంగా సెలవు ఉంటుంది. రాష్ట్రాలు, పండుగలు, తిథుల వారీగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఈ ఆగస్టులో మొత్తంగా 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు సెలవు రోజుల్లో కూడా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంల ద్వారా సేవలను పొందవచ్చు.

చెక్కుల క్లియరెన్సులు, ఇతర భౌతిక లావాదేవీలు మాత్రం సెలవు రోజుల్లో నిలిచిపోతాయి.

ఆగస్టు 8 (శుక్రవారం): టెండంగ్ ల్హో రూమ్ ఫాట్ సందర్భంగా గాంగ్‌టక్‌లో సెలవు.

ఆగస్టు 9 (శనివారం): రక్షా బంధన్ / ఝులనా పూర్ణిమ సందర్భంగా అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, లక్నో, సిమ్లా, భువనేశ్వర్‌లలో సెలవు.

ఆగస్టు 13 (బుధవారం): దేశభక్తుల దినోత్సవం (Patriot's Day) సందర్భంగా ఇంఫాల్‌లో సెలవు.

ఆగస్టు 15 (శుక్రవారం): స్వాతంత్ర్య దినోత్సవం / పార్సీ నూతన సంవత్సరం / జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.

ఆగస్టు 16 (శనివారం): జన్మాష్టమి (శ్రావణ వద్-8) / కృష్ణ జయంతి సందర్భంగా ఐజ్వాల్, చెన్నై, హైదరాబాద్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, విజయవాడ, గాంగ్‌టక్, చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్‌లలో సెలవు.

ఆగస్టు 19 (మంగళవారం): మహారాజా వీర విక్రమ్ కిషోర్ మణిక్య బహదూర్ జన్మదినం సందర్భంగా అగర్తలాలో సెలవు.

ఆగస్టు 25 (సోమవారం): శ్రీమంత శంకర దేవ తిరోభావ తిథి సందర్భంగా గౌహతిలో సెలవు.

ఆగస్టు 27 (బుధవారం): గణేష్ చతుర్థి సందర్భంగా ముంబై, బేలాపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, పనాజీలలో సెలవు.

ఆగస్టు 28 (గురువారం): గణేష్ చతుర్థి (2వ రోజు) / నువాఖై సందర్భంగా భువనేశ్వర్, పనాజీలలో సెలవు.

ఆగస్టులో జాతీయ సెలవులు: ఆగస్టు 3 (ఆదివారం), ఆగస్టు 10 (2వ శనివారం), ఆగస్టు 17 (ఆదివారం), ఆగస్టు 24 (4వ శనివారం), ఆగస్టు 31 (ఆదివారం).. ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+