Bank Manager: డేటింగ్ యాప్ ప్రియురాలికి రూ. 5,70 కోట్లు ఫ్రీగా ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ మేనేజర్, కట్ చేస్తే !
బెంగళూరు/ కోల్ కత్తా: వివాహం చేసున్న బ్యాంకు మేనేజర్ అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. కాన్ఫు కోసం భార్య కేరళ వెళ్లింది. ఐటీ హబ్ లో ఒంటరిగా ఉంటూ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బ్యాంకు మేనేజర్ డేటింగ్ యాప్ లో అతని పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన మహిళతో టచ్ లో ఉన్నాడు. కొంతకాలం తరువాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో బ్యాంక్ లో ఆడిటింగ్ జరిగింది. బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు గోల్ మాల్ అయ్యిందని ఆడిటింగ్ లో వెలుగు చూసింది. బ్యాంకు మేనేజ్ మెంట్ పోలీసు కేసు పెట్టింది. బ్యాంక్ మేనేజర్ ను ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానంతో బ్యాంకు అధికారులు, పోలీసులు బిత్తరపోయారు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన మహిళ చెప్పిన బ్యాంక్ అకౌంట్స్ కు బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు, తన సొంత డబ్బులు రూ. 12 లక్షలు బదిలి చేశానని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో బ్యాంకు యాజమాన్యం షాక్ అయ్యింది. అయితే ఇంత వరకు డేటింగ్ యాప్ లో పరిచయం అయిన మహిళ ముఖం కూడా తాను చూడలేదని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

ఇండియన్ బ్యాంక్ మేనేజర్
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని హనుమంతనగర్ లో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గా హరిశంకర్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. కేరళకు చెందిన హరిశంకర్ వివాహం చేసుకుని అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. కాన్ఫు కోసం హరిశంకర్ భార్య కేరళ వెళ్లింది. ఐటీ హబ్ లో ఒంటరిగా ఉంటున్న హరిశంకర్ ఇండియన్ బ్యాంకులో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

డేటింగ్ యాప్ లో అనితా
ఇండియన్ బ్యాంకు మేనేజర్ హరిశంర్ డేటింగ్ యాప్ లో అతని పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా అనే మహిళతో బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ టచ్ లో ఉన్నాడు. కొంతకాలం తరువాత హరిశంకర్, అనితా ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని రోజూ గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు.

తియ్యటి మాటలకు కరిగిపోయి ఏం చేశాడంటే ?
డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా సెక్సీగా తియ్యగా మాట్లాడటంతో హరిశంకర్ విరహంతో రగిలిపోయాడు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా మాటలకు బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ పడిపోయాడు. ఆమె ఏం చెబితే అది చెయ్యడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో బ్యాంక్ మేనేజర్ అయిన హరిశంకర్ ప్రజలు సోమ్మును దుర్విని యోగం చేశాడు.

ప్రియురాలి కోసం రూ. 5. 70 కోట్లు స్వాహా
డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా చెప్పిన బ్యాంక్ అకౌంట్స్ కు ఇండియన్ బ్యాంకు మేనేజర్ హరిశంకర్ బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు, అతని సొంత డబ్బులు రూ. 12 లక్షలు బదిలి చేశాడు. మే 13వ తేదీ నుంచి మే 19వ తేదీ మధ్యలోనే అనితా చెప్పిన బ్యాంక్ అకౌంట్స్ కు హరిశంకర్ డబ్బులు ట్రాన్సఫర్ చేశాడు.

వారంలో ఇంత డబ్బు గోల్ మాల్ జరిగిందని తెలిసి ?
వారం రోజులు కాకుండానే ఇంత డబ్బు గోల్ మాల్ కావడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. హనుమంతనగర్ లోని ఇండిబ్యాంక్ లో ఆడిటింగ్ జరిగింది. బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు గోల్ మాల్ అయ్యిందని ఆడిటింగ్ లో వెలుగు చూసింది. ఇండియన్ బ్యాంకు సీనియర్ అధికారి మూర్తి హనుమంతనగర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

బ్యాంక్ మేనేజర్ దెబ్బతో షాక్
ఇండియన్ బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ ను ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానంతో బ్యాంకు అధికారులు, పోలీసులు బిత్తరపోయారు. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా అనే మహిళ చెప్పిన పశ్చిమ బెంగాల్ లోని 28 బ్యాంక్ అకౌంట్స్. కర్ణాటకలోని రెండు బ్యాంక్ అకౌంట్స్ కు ఇండియన్ బ్యాంకుకు చెందిన రూ. 5.70 కోట్లు, తన సొంత డబ్బులు రూ. 12 లక్షలు బదిలి చేశానని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ అంగీకరించడంతో బ్యాంకు యాజమాన్యం, పోలీసులు షాక్ అయ్యారు.

ఒక్కసారికూడా ముఖం చూడలేదు
అయితే ఇంత వరకు డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అనితా అనే మహిళ ముఖం ఒక్కసారి కూడా తాను చూడలేదని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ హరిశంర్ పోలీసులకు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ తో పాటు అదే బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న కౌసల్యా, క్లర్క్ మునిరాజు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ ను అరెస్టు చేసిన హనుమంతనగర పోలీసులు డేటింగ్ యాప్ లోని అతని ప్రియురాలు అనితా కోసం గాలిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications