మైనర్ బాలికపై రేప్, వీడియో తీసి బ్లాక్‌మెయిల్: బ్యాంక్ మేనేజర్ అరెస్ట్

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాంక్ మేనేజర్.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తుకోగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మోహాలిలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న నిందితుడి(53)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇండోర్‌లో బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో బాధితురాలు తన స్నేహితుల ద్వారా నిందితుడికి పరిచయమైంది.

Bank manager rapes minor in MPs Indore, records video to blackmail her

ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను మచ్చిక చేసుకునేందుకు ఆమెను తరచూ షాపింగ్ తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఓసారి హోటల్ తీసుకెళ్ళిన నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని వీడియో తీసి, ఆమెను తరచూ బెదిరింపులకు గురిచేశాడు.

తన స్నేహితురాలు కూడా తనపై జరిగిన ఘాతుకానికి కారణమని, ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+