అమ్మ.. బ్యాంకు సిబ్బంది... పని ఒత్తిడిలో తాళం వేయడమే...
లక్నో : బ్యాంకులు.. నగదు, నగలు, ముఖ్యమైన పత్రాలు ఉంటాయి. అందుకే బ్యాంకుల వద్ద సెక్యూరిటీ కూడా ఉంటారు. రాత్రి పూట మాత్రం తాళం వేసి వెళుతుంటారు. కానీ యూపీలో ఓ బ్యాంకు ఉద్యోగులు చేసిన నిర్వాకం చర్చకు దారితీసింది. విధులు ముగిసిన తర్వాత అందరూ తాపీగా ఇంటికెళ్లిపోయారు. ఎలాగంటే సాదాసీదాగా వెళ్లారు. ఇందులో సందేహం ఏంటీ అని కదా మీ డౌట్.
అవును వారంతా వెళ్లిపోయారు. కానీ బ్యాంక్‌కు తాళం వేయకుండా వెళ్లిపోయారు. యూపీలోని ముజఫర్‌నగర్‌లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఘటన జరిగింది. నిన్న సిబ్బంది పనివేళలు ముగిసిన వెంటనే తలొదారిన వెళ్లిపోయారు. అయితే రాత్రి అవుతుంది. అర్థరాత్రి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూశాడు. బ్యాంకు తాళం లేని విషయం చూసి ఆశ్చర్యపోయాడు. కళ్లు తడుముకొని మరీ చూసి .. వెంటనే పోలీసులు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు బ్యాంకు వద్దకు పరుగులు తీశారు.

అక్కడికి బ్యాంకు మేనేజర్‌ను కూడా పిలిపించారు. బ్యాంకుకు తాళం వేయలేదని పోలీసులు తెలియజేయడంతో .. మేనేజర్ నోరేళ్లబెట్టారు. బ్యాంకులో ఏమైనా పోయాయేమో అని తనిఖీ కూడా చేశారు. కానీ బ్యాంకులో నగదు, సామాగ్రి ఉన్నాయి. దీంతో కాస్త రిలీఫ్ అయ్యారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ నగదు, నగలు పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. భద్రత ఉంటుంది కదా అని బ్యాంకులో వేస్తే ఇలాగేనా వ్యవహరించేది అని విమర్శిస్తున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications