ఆ వంకతో వచ్చి.. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై..: బ్యాంకు ఉద్యోగినిపై లైంగిక దాడి..
న్యూఢిల్లీ: 29ఏళ్ల ఓ బ్యాంకు ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగిని ఇంట్లో ట్యాప్ రిపేర్ చేయడం కోసం వచ్చిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గతేడాది డిసెంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఆమె ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎవరామె?:
బాధితురాలు మూడేళ్లుగా ఒక బ్యాంకులో పనిచేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీకి బదిలీ అవడంతో.. ఆఫీసుకు దగ్గరలోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఉదయం పూట ఆఫీస్ తాళం తెరిచే డ్యూటీ కూడా ఆమెదే కావడంతో.. దగ్గరలోని ఓ నాలుగంతస్తుల అపార్టుమెంటులో ఆమె అద్దెకు దిగారు. ఎనిమిది నెలల నుంచి ఆమె ఒక్కరే ఆ ఇంట్లో ఉంటున్నారు. అక్కడ ఆమెకు పరిచయస్తులు కూడా ఎవరూ లేరు.

ఏమైంది..:
తాను పనిచేస్తున్న బ్యాంకులోనే పనిచేసే ఓ గార్డ్.. ఆమె ఇంట్లోనూ పనిమనిషిగా చేస్తున్నాడు. ఓరోజు ఆఫీస్ నుంచి తిరిగొచ్చేసరికి ఇంట్లో వాటర్ రావడం లేదని ఆమెతో చెప్పాడు. దీంతో కింది ఫ్లోర్‌లో జిమ్ నిర్వహిస్తున్న అపార్టుమెంట్ యజమాని కొడుకు వద్దకు వెళ్లి ఆమె సహాయం కోరింది. అయితే సహాయం చేయడానికి అతను నిరాకరించగా.. జిమ్ లోనే ఉన్న మరో వ్యక్తి సహాయం చేస్తానని ఆమెతో పాటు ఫ్లాట్ వద్దకు వచ్చాడు.

అత్యాచార యత్నం..:
ఆమె, అతనూ ఫ్లాట్ వద్దకు రాగానే పనిమనిషి వెళ్లిపోయాడు. ఇంత రాత్రివేళ అతనితో టెర్రస్ పైకి వెళ్లి ట్యాంక్ చెక్ చేయడంపై ఆమెకు ఎందుకో అనుమానం కలిగింది. ఏదో ఒకటి చెప్పి అతన్ని పంపించేయాలనుకుంది. కానీ ఇంతలోనే ఆమెను బెడ్‌రూమ్ లోకి నెట్టేసి అతను అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను అసభ్యంగా తాకుతూ బలవంతం చేయబోయాడు.

పోలీసులకు ఫిర్యాదు:
తనపై లైంగిక దాడి చేయబోయిన సమయంలో.. బెడ్‌పై ఉన్న తన ట్యాబ్‌తో అతని ముఖంపై కొట్టానని, ఆపై ఇంటి నుంచి బయటకు పంపించానని బాధితురాలు పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే, జరిగిన ఘటనలో బ్యాంకు పేరు బయటపెట్టి చెడ్డ పేరు తీసుకొచ్చావని తోటి ఉద్యోగులు తనను నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి తాను బ్యాంకు పేరు ఎక్కడా బయటపెట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications