బడ్జెట్‌కు ముందు బ్యాంకుల బంద్, వేతన సవరణ కోసం పట్టు, 20 శాతం పెంచాలని సమ్మె..

వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఉద్యోగుల శుక్రవారం నుంచి రెండురోజులపాటు ఆందోళన చేపట్టబోతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన సిబ్బంది ఆందోళన చేపట్టనున్నారు. దీంతో రెండురోజుల పాటు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. 2017 నవంబర్ తర్వాత తమకు వేతన సవరణ చేయలేదని బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు శనివారం కూడా బ్యాంకులు బంద్ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు పనిచేయకపోవడంతో ఏటీఏంలో కూడా నగదు లోటు ఏర్పడే అవకాశం ఉంది.

పాల్గొనేది ఈ యూనియన్లే..

పాల్గొనేది ఈ యూనియన్లే..

రెండురోజులపాటు స్ట్రైక్ చేస్తున్నామని యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎప్‌బీయూ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్పెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయ్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (నేవోబీడబ్ల్యూ) బ్యాంకు సిబ్బంది తెలిపారు.

ఇప్పటికే సమాచారం..

ఇప్పటికే సమాచారం..

జనవరి 31, ఫిబ్రవరి 1న బ్యాంకులు పనిచేయవని ఖాతాదారులకు ఇప్పటికే కొన్ని బ్యాంకులు సమాచారం అందించాయి. బ్యాంకు బంద్‌తో సేవలకు అంతరాయం కలుగుతోందని చెప్పారు. ఈ నెల 8వ తేదీన కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది.

 20 శాతం హైక్..

20 శాతం హైక్..

సాధారణంగా బడ్జెట్‌ కంటే ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి ఒకరోజు ముందు పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. మరుసటి రోజు ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం చదివి వినిపిస్తారు. బడ్జెట్ నేపథ్యంలో బ్యాంక్ సంఘాల ఆందోళన విరమింపజేసేందుకు కార్మికశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నించారు. కానీ అందుకు సంఘాలు మాత్రం ససేమిరా అన్నాయి. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తే తప్ప వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. తమ పే స్లిప్పులో 20 శాతం వేతన సవరణ చేయాలని బ్యాంకు యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి.

 అంతకుముందు 15 శాతం..

అంతకుముందు 15 శాతం..

చివరిసారి బ్యాంకు ఉద్యోగులకు యాజమాన్యం 2012 నవంబర్ 1వ తేదీన వేతన సవరణ చేపట్టారు. 2017 అక్టోబర్ 13వ తేదీ వరకు 15 శాతం హైక్ వేశారు. ఇక అప్పటినుంచి వేతన సవరణ చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కార్మిక సంఘాలు జనవరి 8వ తేదీన సమ్మె చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+