పెద్ద నగదు నోట్ల రద్దు, ఆందోళనలకు ఉద్యోగసంఘాల పిలుపు, చివరిరోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయా

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఏర్పడినసమస్యలను పరిష్కరించాలని , ఈ విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 28 ,29, వచ్చే ఏడాది జనవరి 2,3 తేదిల్లో

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . అయితే బ్యాంకు ఉద్యోగులు కూడ తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగనున్నారు.

ఈ మేరకు వారు తమ డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అందించనున్నారు బ్యాంకు ఉద్యోగులు. ఉద్యోగుల

ఆందోళనల సందర్భంగా ఇప్పటికే స్థానికంగా ఉన్న ఆర్ బి ఐ అధికారులకు వినతిపత్రాలు అందించారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నెలకొన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినా వాటిని పరిష్కరించేందుకు ఏ మాత్రం చొరవ చూపడం లేదని బ్యాంకు ఉద్యోగుల

సంఘం నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయమై డిసెంబర్ 28వ, తేదిన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నారు. మరునాడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం సమర్పించనున్నారు

బ్యాంకు ఉద్యోగులు.2017 జనవరి 2, 3 తేదిల్లో కూడ ఆందోళనలు కొనసాగించనున్నారు.

బ్యాంకులు పనిచేస్తాయా

పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా రద్దుచేసిన నగదు నోట్లను డిసెంబర్ 30వ, తేదిలోపుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అయితే బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలకు పిలుపు ఇవ్వడంతో బ్యాంకుల్లో ఉద్యోగులు విధులకు హాజరౌతారా, బ్యాంకులు పనిచేస్తాయా అనేది చర్చనీయాంశమైంది.

రద్దు చేసిన నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు చివరి రోజులు కావడంతో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలో ఉంటే బ్యాంకు కార్యకలాపాలు స్థంబించే అవకాశం ఉంది. అయితే ఈ ఆందోళనకు పిలుపునిచ్చిన రెండు సంఘాల్లో సుమారు 5.50 లక్షల మంది సభ్యులున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులున్నారు. సరిపోను బ్యాంకులకు నగదును సరఫరాచేయాలని ఆర్ బి ఐని కోరినా సక్రమంగా సరఫరాచేయడం లేదని యూనియన్నాయకులు
ఆరోపిస్తున్నారు.

నగదు అందుబాటులో లేకపోతే ఆ కార్యాలయాల్లో లావాదేవీలను నిలిపివేసే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని యూనియన్ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. పెద్ద నగదునోట్ల రద్దు కారణంగా ఏర్పడిన పని ఒత్తిడితో మరణించిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+