బ్యాంకులో రుణం పొందాలా..? : ఫేస్ బుక్ పైనా ఓ లుక్కేయండి

పుణే : చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక.. ప్రతీ ఒక్కరి జీవితాల్లో సోషల్ మీడియా ఓ భాగమైపోయింది. అది ఎంతలా అంటే బ్యాంకు ఖాతా లేనివారైనా ఉండొచ్చు గానీ ఈరోజుల్లో ఫేస్ బుక్ ఖాతా లేని యువత చాలా అరుదు. ఛాటింగులు, కొత్త స్నేహాలు, లైకులు కామెంట్ల లెక్కలు.. అబ్బో ఒక్కటేమిటి లేచింది మొదలు పడుకునేదాకా సోషల్ మీడియాలోనే తెల్లారిపోయే జీవితాలెన్నో..!

ఇంతకీ అసలు విషయమేంటంటే.. రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ఫేస్ బుక్ ఖాతాలపై కూడా ఫోకస్ చేస్తున్నాయట కొన్ని బ్యాంకులు. దరఖాస్తును మాత్రమే కాదు, ఆయా వ్యక్తుల సామాజిక స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి ఫేస్ బుక్ ఖాతాను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయట.

వ్యక్తుల సామాజిక స్థితి గతులను ఫేస్ బుక్ ద్వారా పరిశీలించి డిఫాల్టింగ్ రిస్క్ (రుణ ఎగవేత ప్రమాదం)పై ఒక అంచనాకు వస్తున్నాయట ఆయా ఏజెన్సీలు. అలాగే రణాల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు కూడా ఫేస్ బుక్ మిత్రులు చాలావరకు సహాయపడుతున్నారట. రుణాల ప్రాసెసింగ్ వేగంగా జరగడానికి, వడ్డీ రేట్లకు సంబంధించిన విషయాల్లోను ఫేస్ బుక్ మిత్రుల సలహాలు రుణ గ్రస్తులకు ఉపయోగపడుతున్నాయట.

banks checking loan holders facebook status also

ఎలాంటి క్రెడిట్ డేటా అందుబాటులో లేని, తొలిసారి రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి విషయంలో ఫేస్ బుక్ ఖాతాల ద్వారా వాళ్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి ఆయా బ్యాంకులు. ఈ విషయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు కూడా బ్యాంకులనే ఫాలో అవుతున్నాయి.

ఇదే విషయంపై స్పందించిన క్రెడిట్ మంత్రి సహ వ్యవస్థాపకుడు రంజిత్ పుంజా.. రుణ మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీలు సైతం ప్రత్యామ్నాయ సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయని తెలిపారు.

పుణేలో ఏర్పాటైన 'ఎర్లీ శాలరీ' అనే స్టార్టప్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతోంది. రుణాల కోసం 1000 దరఖాస్తు చేసుకోగా, వారి ఫేస్ బుక్ డేటాను విశ్లేషించి తద్వారా ఒక అంచనాకు వచ్చినట్టు వెల్లడించింది.

దీనిపై స్పందించిన ఎర్లీ శాలరీ సీఈఓ అక్షయ్ మెహరోత్రా.. వేతనాలు పొందడంలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్న యువత ఆర్థిక అవసరాలను తీర్చేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ తదితర ఖాతాల్లోని దరఖాస్తుదారుల వివరాలను సేకరించి వాటి ద్వారా ఓ అంచనాకు వస్తున్నట్టు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+